Veligonda
-
ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ -1 పనులు పూర్తి
-
CM YS Jagan: ఆర్ట్ టీచర్ అద్భుత చిత్రం
కొనకనమిట్ల (ప్రకాశం): ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మువ్వన్నెలు రెపరెపలాడే తరుణంలో వచ్చిన ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాకుసెల్యూట్ చేస్తున్నట్లు చిత్రాన్ని వేశారు. కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న కొమ్ము ప్రసాద్.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని ఆర్ట్స్ రూపంలో అద్భుతంగా వేయడాన్ని స్థానికులు అభినందించారు. (చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 20న మెగా జాబ్‌మేళా) -
మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే బుర్రా
వెలిగండ్ల: రాష్ట్రంలో మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి, పద్మాపురం, బొంతగుంట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హుస్సేన్‌పురం గ్రామ సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ బుక్‌లెట్‌ను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికీ చేకూరిన లబ్ధి వివరించారు. హుస్సేన్‌పురంలో మంచంలో నడవలేని స్థితిలో ఉన్న యాదమ్మతో సీఎం జగనన్న మీ కుటుంబానికి మూడేళ్లలో వైఎస్సార్ పింఛన్ కానుక కింద రూ.82 వేలు ఇచ్చారన్నారు. సీఎం వైఎస్ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సారికూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే వస్తుందని యాదమ్మ బదులిచ్చారు. పద్మాపురంలో అక్కి యోగమ్మకి సుగర్ కారణంగా రెండు కాళ్లూ తీసివేయడం చూసి ఎమ్మెల్యే బుర్రా చలించిపోయారు. మూడు వేల పింఛన్ తీసుకుంటున్న యోగమ్మకు ఐదు వేల పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే బుర్రా ఆదేశించారు. తమ్మినేనిపల్లిలో తమ్మినేని పెద్దిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎమ్మెల్యే ఆయన్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం సేవలు అందించాలని రిమ్స్ వైద్యులను కోరారు. (క్లిక్: 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్..) ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎంపీపీ రామన మహాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు గుంటక తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ సుకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు డి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘ అధ్యక్షుడు తమ్మినేని శివరామయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు యెలికె రమణయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు టి.దేవసహాయం, వై.నాగూర్‌యదవ్ , పీఏసీఎస్ చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, పొల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నాయకులు ఉండేల చిన వెంకటరెడ్డి, కర్నాటి చిన వెంకటరెడ్డి, రామకృష్ణ, వెంకటరెడ్డి, కె. వెంకట్రామయ్య, కె.అంకిరెడ్డి పాల్గొన్నారు. (క్లిక్: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్) -
మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి..
ప్రకృతినే నమ్ముకున్న గిరిజనులు వాటినే ఆధారం చేసుకుని మంచి ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సమీపిస్తే అడవిలో మారేడును సేకరించి నన్నారి షర్బత్ తయారీకి పూనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఒక సంఘంగా ఏర్పడి విరివిగా షర్బత్‌ను తయారుచేసి విక్రయిస్తున్నారు. వేసవి నేపథ్యంలో రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న సన్నారి షర్బత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్న గిరిజనులు ఆర్థిక పరిపుష్టికి అడుగులు వేస్తున్నారు. సాక్షి, నెల్లూరు : జిల్లాలోని రాపూరు మండలంలో నన్నారి షర్బత్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన గిరిజనులు దీనినే ఉపాధిగా మార్చుకున్నారు. స్థానిక వెలుగొండల్లో దొరికే అటవీ ఫలసాయాన్ని సేకరించి నన్నారీని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసి ఆదాయం గడిస్తున్నారు. ప్రకృతి వనరులతో తయారు చేసే నన్నారి షర్బత్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత్త తగ్గుతుంది. సంఘటితంగా ఏర్పడి వెలుగొండలను ఆనుకుని ఉన్న రాపూరు మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉన్న అటవీనే నమ్ముకుని జీవించే గిరిజన మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దకాలంలోనే గిరిజనులు సంఘటితంగా ఏర్పడి గ్రామస్థాయి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ యానాది మండల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ఆపై వారి జీవన విధానం మెరుగు పరుచుకునేందుకు ప్రధాన మంత్రి వన్‌ధన్ యోజన కార్యక్రమం ఏర్పాటుచేసి తద్వారా మెరుగైన జీవనోపాధులు కల్పించుకోవడం జరిగింది. వెలుగొండల్లో ముడిసరుకు సేకరించి.. వెలుగొండల్లో విరివిగా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. 275 మంది గిరిజన సభ్యులు వన్‌ధన్ వికాస కేంద్రం(వీడీవీకే) ఏర్పాటు చేసుకుని అటవీ ఫలసాయం సేకరణ చేస్తున్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో గిరిజనులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కావలసిన శిక్షణ కార్యక్రమాలు, తయారీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉసిరితో.. అలాగే జనవరి నుంచి మార్చి నెల వరకు వెలుగొండ అడవుల్లో ఉసిరి కాయల సేకరణ జరుగుతుంది. ఈ సీజన్లో దాదాపు 20 టన్నుల ఉసిరి కాయలను సేకరిస్తుంటారు. దాదాపు 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సేకరించిన ఉసిరికాయలను కేజీ రూ.30ల చొప్పున దళారులు గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. విలువ ఆధారిత ఉత్పత్తిలో భాగంగా ఉసిరి కాయలతో ఉసిరి క్యాండీలు చేయడం వలన, మూడు కేజీల ఉసిరికాయలతో ఒక కేజీ క్యాండీలను తయారీ చేస్తారు. వీటి విలువ మార్కెట్లో రూ.500గా ఉంది. ఈ ఉసిరి క్యాండీల తయారీలో దాదాపు 30 మంది గిరిజనులు శిక్షణ పొందారు. చక్కెర పాకంలో ఉడకబెట్టిన ఉసిరి కాయలను నానబెట్టడం ద్వారా ఈ క్యాండీలను తయారు చేస్తారు. తయారీ ఖర్చు పోగా, మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే నిమ్మకాయ ఊరగాయల తయారీ, స్వచ్ఛమైన తేనె సేకరణ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తులను పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో మార్కెటింగ్ చేసేలా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సాయం చేశారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్లో కూడా పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎటువంటి కల్తీ లేని అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఫలసాయంతో మండలంలోని దాదాపు 1,590 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. విలువపెంచి విక్రయాలు అడవుల్లో సేకరించే కలపేతర అటవీ ఉత్పత్తులకు ముడిసరుకులు విక్రయిస్తే అంతగా ఆదాయం వచ్చేది కాదు. ముడిసరుకులను బయటకు వెళ్లి వస్తువుల విలువలను పెంచి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఒక కేజీ కుంకుళ్లు అమ్మితే రూ.20 వస్తుంది. అదే విత్తనాలను వేరు చేసి అమ్మితే కేజీ రూ.140 వస్తుంది. ఉసిరి కేజీ అమ్మితే రూ.30 వస్తుంది అదే ఆమ్ల క్యాండీలుగా చేసి అమ్మితే కేజీ రూ.500 వరకు వస్తుంది. మారేడు కూడా కేజీ రూ.350 వస్తుంది అదే నన్నారి షర్బత్ చేసి అమ్మితే రూ.2500 వస్తుంది. ఇలా లాభదాయకంగా ఉంది. – వెలుగు సుబ్బయ్య, వన్‌ధన్ వికాస కేంద్రం అధ్యక్షుడు అందరం సంపాదిస్తున్నాం వన్‌ధన్ వికాస కేంద్రం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పని దొరుకుతోంది. ఇంట్లోని వారంతా సంపాదిస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాం. డీఆర్డీఏ, ఐటీడీఏ, జీసీసీ వారు మాకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేశారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – గాలి శ్రీనివాసులు, వన్‌ధన్ వికాస కేంద్రం కార్యదర్శి నన్నారి తయారీ ఇలా.. శ్రీ లక్ష్మీనరసింహ యానాది మండల సమాఖ్యలోని సభ్యుల్లో దాదాపుగా 30 మంది నన్నారి షర్బత్ తయారీలో నిష్ణాతులుగా ఉన్నారు. అలాగే 150 మంది నన్నారి షర్బత్‌కు కావల్సిన మారేడు గడ్డలను సేకరించి ప్రాసెసింగ్ చేస్తుంటారు. గాలి వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, వెలుగు సుబ్బయ్య, యాకసిరి జయరామయ్య, నారాయణ, నల్లు శివ మొదలగు వారు ఈ నన్నారి షర్బత్‌ను తయారు చేస్తుంటారు. జనవరి నుంచి జూన్ నెల వరకు నన్నారి షర్బత్ తయారీ మీద గిరిజనులు దృష్టి పెడుతుంటారు. దీనికి కావల్సిన మారేడు గడ్డలను వెలిగొండ అడవుల్లో జనవరి నుంచి మే నెల వరకు సేకరిస్తారు. ఈ సీజన్లో దాదాపుగా 10 నుంచి 15 టన్నుల వరకు మారేడు గడ్డలను సేకరిస్తారు. సాధారణంగా ఒక కేజీ గడ్డల విలువ రూ.400 ఉండగా ఒక కేజీ నుంచి 30 లీటర్ల నన్నారి షర్బత్‌ను తయారు చేయవచ్చు. మార్కెట్లో ఒక లీటర్ రూ.160 ఉండగా కేజీ మారేడుతో దాదాపుగా రూ.4,800 ఆదాయం వస్తుంది. ఇలా 15 టన్నులకు రూ.72 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అందులో తయారీకి కావల్సిన ఇతర దినుసుల ఖర్చు, తయారీ ఖర్చు, లేబర్ వంటి వాటిని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు. -
నిధి రాత
-
గుప్తనిధుల వేటకు వెళ్లిన కెనరా బ్యాంక్ ఉద్యోగి మృతి
సాక్షి, ఒంగోలు: వారు ముగ్గురు స్నేహితులు. వీరికి సులువుగా డబ్బు సంపాదించుకోవాలనే ఆశ కలిగింది. గుప్తనిధుల వేటలో పడ్డారు. అందుకు అవసరమైన సామగ్రితో పాటు మంచినీరు, ఆహారం, మజ్జిగ తీసుకుని బయల్దేరారు. ఇంకే ముంది ఎవరు చెప్పారో ఏమో ముగ్గురు కలిసి తర్లుపాడు మండలం తాడివారిపల్లె సమీపంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. గత ఆదివారం రాత్రి అడవిలోకి వెళ్లిన వీరు తిరిగి వచ్చేందుకు రహదారి కనుగొనలేక ముగ్గురూ మూడు దారుల్లో వెళ్లారు. ఒకరు దాహార్తికి తట్టుకోలేక మృత్యువాత పడగా మరొకరు చెట్టు, పుట్టను పట్టుకుని రోడ్డుకెక్కారు. ఇంకొకరి కోసం పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన కృష్ణనాయక్, హనుమంత నాయక్, హైదరాబాద్‌లో కెనరా బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న కట్టా శివకుమార్‌లు తాడివారిపల్లె వెలిగొండ అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక రాత్రంతా అడవిలోనే గడిపారు. తిరిగి రెండో రోజు కూడా కొండ నుంచి కిందకు దిగేందుకు బయల్దేరారు. వీరిలో కృష్ణానాయక్ మాత్రమే సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర దాహంతో కర్నూలు–ఒంగోలు రోడ్డుకు చేరుకున్నాడు. సమీపంలోని గుడి వద్దకు వెళ్లి దాహం తీర్చుకున్నాడు. మరో ఇద్దరు అటవీ ప్రాంతాన్ని దాటలేకపోయారు. బయటకు వచ్చిన కృష్ణానాయక్ అదృశ్యమైన హనుమంతనాయక్, శివకుమార్ బంధువులకు చెప్పాడు. అటవీ ప్రాంతానికి చేరుకున్న శివకుమార్ బంధువులతో పాటు కృష్ణానాయక్ మంగళవారం, బుధవారం అదృశ్యమైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తాడివారిపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పొదిలి సీఐ చిన్న మీరా సాహెబ్ నేతృత్వంలో 15 మంది ప్రత్యేక బలగాలు, పోలీసులు, ఫారెస్ట్ ఉద్యోగి నాగరాజు గాలించేందుకు అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 నుంచి తీవ్రంగా శ్రమించగా ఒంటి గంట ప్రాంతంలో శివకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి కోసం ఇంకా అడవిలోనే గాలిస్తున్నారు. తాగేందుకు నీరు లేకపోవడంతోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వెలిగొండకు వెన్నుపోటు
► ప్రాజెక్టు పూర్తికి కావల్సింది రూ.2,800 కోట్లు ► తాజా బడ్జెట్లో రూ.200 కోట్ల మొక్కుబడి నిధులు విదిల్చిన సర్కారు మొదటి ఫేజ్ కే రూ.వెయ్యి కోట్లు అవసరం ► ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దశాబ్ద కాలం పట్టే పరిస్థితి ► 2018కే నీళ్లంటూ బాబు మాటల గారడీ వెలిగొండ ప్రాజెక్టుతోనే ప్రకాశం ప్రగతి ► నిధులివ్వకపోయినా పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వరుస కరువులకు.. మితిమీరిన ఫ్లోరైడ్‌తో కిడ్నీ వ్యాధి మరణాలకు.. వెలిగొండ ప్రాజెక్టుతో పెద్ద లింకే ఉంది. ఇక్కడి కరువు నుంచి జనం గట్టెక్కాలన్నా... కిడ్నీ వ్యాధి మరణాలు తగ్గాలన్నా... పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా... వెలిగొండ ప్రాజెక్టే ఏకైక దిక్కు. వ్యవసాయరంగానికి కావాలి్సన సాగునీరు, జనం దప్పిక తీర్చే తాగునీరు ఈ ప్రాజెక్టు వల్లే సాధ్యం. మోడువారిన పశ్చిమ ప్రకాశం కళకళలాడాలన్నా వెలిగొండతోనే సాధ్యం. మొత్తంగా ప్రకాశం జిల్లా మనుగడ వెలిగొండపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పాలకులు చేస్తున్న హామీలు ఆచరణలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మిగిలి ఉన్న పనులను నిధులిచ్చి పూర్తి చేసిన పాపానపోలేదు. దీంతో వెలిగొండ నీరు జిల్లా వాసులకు అందనంత దూరంలోనే ఉండిపోతోంది. ప్రకటనల ప్రగల్బాలే.. వెలిగొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు వెచ్చించి తన హయాంలోని నీటిని పారిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది అవిగో నీళ్లు.. ఇదిగో ప్రాజెక్టు అంటూ మాటలతో సరిపెట్టడం తప్ప నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదు. తాజాగా వెలిగొండను పూర్తి చేసి 2018 జూ¯ŒS నాటికి నీటిని విడుదల చేస్తామంటూ మరోమారు బాబు గొప్పలు చెప్పారు. వెలిగొండ మన హయాంలో పూర్తి చేస్తామని ఈ విషయాన్ని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసుకోండంటూ విజయవాడలో జరిగిన టీడీపీ జిల్లా సమీక్షా సమావేశంలోనూ ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. ఇది జరిగి పట్టుమని 10 రోజులు కాకుండానే తాజా బడ్జెట్లో వెలిగొండకు కేవలం రూ.200 కోట్లు కేటాయించి మరోమారు ఈ ప్రాజెక్టుపై బాబు వివక్ష చూపారు. ప్రాజెక్టు పూర్తి కావటానికి తాజా అంచనాల ప్రకారం మరో రూ.2,800 కోట్లు అవసరం. చంద్రబాబు చెప్పినట్లు ఫేజ్–1 పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయటానికి కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకు అవసరం. కానీ బడ్జెట్లో బాబు సర్కారు కేటాయించింది మాత్రం రూ.200 కోట్లే. ఈ లెక్కన మరో 15 ఏళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తి కాదని బాబు చెప్పకనే చెప్పారు. వెలిగొండకు సర్కారు నిధులు కేటాయించకపోయినా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం గమనార్హం. జిల్లా అభివృద్ధికి వెలిగొండే ఆధారం జిల్లాలోని వ్యవసాయ రంగమే కాదు.. పారిశ్రామిక రంగం సైతం వెలిగొండ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని సాక్షాత్తు పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. వెలిగొండ నీరు లేకపోతే ఏ ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. అంటే జిల్లాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనట్లే! చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కుబడి నిధులను మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఇచ్చినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నా కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నిర్మాణ పనులకు రూ.25 కోట్లకుపైనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నిధులివ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సైతం ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టన్నెల్–1, 2 పనులను ఇరువైపుల చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. తీరా బడ్జెట్లో చూస్తే సర్కారు రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు వెలిగొండ పనులను వేగవంతం చేసే పరిస్థితి కనిపించటం లేదు. ఫ్లోరైడ్ పీడకు వెలిగొండే విరుగుడు.. జిల్లాలో ఫ్లోరైడ్ శాతం తీవ్ర స్థాయికి చేరింది. 15 శాతం ఫ్లోరైడ్ ఉన్న గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2,200 హాబిటేషన్లు ఉండగా 1200 హాబిటేషన్లలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీంతో ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరింది. తద్వారా కిడ్నీ వ్యా«ధితో జనం మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలోనే 427 మంది మరణించారు. వందలాది మంది మరణానికి దగ్గరగా ఉన్నారు. వేలాది మంది వ్యాధికి గురయ్యారు. రక్షిత మంచినీరు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వెలిగొండ పూర్తయి కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ తగ్గుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత, కిడ్నీ వ్యాధి మరణాలు వివరాలను ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ బారి నుంచి జిల్లా వాసులను రక్షించాలని ఆయన కోరుతున్నారు. వ్యాధి తీవ్రతకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి నడ్డాకు వివరించారు. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరీ ఆశలు వెలిగొండపైనే ఉన్నాయి. కానీ నిధుల కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే ఇప్పటికే ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించి, వెలిగొండ ప్రాజెక్టుకు అధికంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి్సన అవసరం ఉంది. 2018 నాటికైనా ప్రాజెక్టును పూర్తి చేయించి నీటిని విడుదల చేయించేందుకు కృషి చేసి, కరువు జిల్లాను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి. -
అవసరం కొండంత ...ఇంచ్చింది గోరంత
ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కో హామీని గాలికొదిలేసింది. ఆది నుంచి జిల్లా అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. తాజా బడ్జెట్లోనూ మొండిచేయి చూపింది. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టగా..జిల్లా అభివృద్ధికి కీలకమైన పోర్టు, విమానాశ్రయం, పారిశ్రామికవాడల ఊసే ఎత్తలేదు. సంక్షేమ పథకాల అమలుకూ మొక్కుబడిగా నిధులిచ్చి చేతులు దులుపుకున్నారు. బడ్జెట్లో జిల్లాను చిన్నచూపు చూడటంపై జనం మండిపడుతున్నారు. ►జిల్లాపై బాబు శీతకన్ను ►బడ్జెట్లో వెలిగొండకు కేటాయించింది ►రూ.200 కోట్లే ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు ►అవసరం కొరిశపాడు లిఫ్ట్‌కు ఇచ్చింది రూ.7.45 కోట్లు ►పాలేరు రిజర్వాయర్‌కు రూ.3.98 కోట్లు రాళ్లపాడుకు రూ.1.28 కోట్లు ►ఊసే లేని రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు 2017-–18 బడ్జెట్లో బాబు సర్కారు మొండిచేయి చూపింది. జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామంటూనే సర్కారు వంచనకు పాల్పడింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.2,800 కోట్లు అవసరం కాగా, బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.200 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టే పరిస్థితి నెలకొంది. రూ.1,56,980 కోట్ల బడ్జెట్ అంటూ ఘనంగా చెప్పుకున్న బాబు సర్కారు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూసింది. ఇరిగేష¯ŒS ప్రాజెక్టులకు అరకొర నిధులు విదల్చగా ఇక జిల్లాకు ఇచ్చిన ప్రధాన హామీలు రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం, మైనింగ్ యూనివర్సిటీ, కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ మొదలుకొని ఏ ఒక్క హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. వెలిగొండకు చిల్లర విదిలింపు: తాజా అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం. కనీసం ఫేజ్–1 పరిధిలోని టన్నెల్–1, హెడ్‌రెగ్యులేటర్ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకే వెయ్యి కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతా క్రమంలో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించినా... బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి మొక్కుబడి నిధులతో సరిపెట్టారు. ఇప్పటికే పాత బకాయిలు రూ.50 కోట్లు ఉన్నాయి. వాటికి పోను కేటాయింపులు చూస్తే కేవలం రూ.150 కోట్లు ఇచ్చినట్లు. జిల్లాలోని కరువును పారదోలటంతో పాటు ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యం. జిల్లా వాసులకు తాగు, సాగునీరుకు ఈ ప్రాజెక్టే ఏకైక ఆధారం. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.40 లక్షల ఎకరాలకు, వందలాది గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాల్సి ఉంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. దాని నిధుల కేటాయింపులు చూస్తే మరో దశాబ్ద కాలానికి కూడా వెలిగొండ పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా అందదు. మిగిలిన ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులే.. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.125 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.7.45 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పాలేరు రిజర్వాయర్ పరిధిలో రూ.50 కోట్లు అవసరం కాగా రూ.3.98 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రాళ్లపాడు స్టేజ్–2 పనులకు రూ.1.28 కోట్లు, వీరరాఘవునికోట ప్రాజెక్టుకు రూ.1.8 కోట్లు, కంభం చెరువుకు రూ.28 లక్షలు, పాలేటి బిట్రగుంట పనులకు రూ.45 లక్షలు, ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ డ్రైనేజీ పనులకు రూ.45 లక్షల చొప్పున కేటాయించారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి తాజా బడ్జెట్లో రూ.266.73 కోట్లు కేటాయించినట్లు లెక్కల్లో చూపారు. వాస్తవానికి గుండ్లకమ్మ ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం నిధుల కేటాయింపులు లేవు. పట్టుమని రూ.20 నుంచి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తే పనులు పూర్తయ్యేవి. అయితే చంద్రబాబు సర్కారు వచ్చాక బడ్జెట్ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లలోపు నిధులు అయితే సరిపోతాయని అధికారులు తాజా అంచనాలు ప్రభుత్వానికి పంపారు. విచిత్రమేమిటంటే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.266.73 కోట్లు కేటాయించటం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున దోచుకునేందుకే అంచనాలను భారీగా పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.103.56 కోట్లు కేటాయించారు. మొత్తంగా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు చంద్రబాబు సర్కారు నిధుల కేటాయింపుల్లో మొండిచేయి చూపిందని చెప్పాలి. పోర్టు..పారిశ్రావిుక కారిడార్ల ఊసేదీ.. బడ్జెట్లో రామాయపట్నం ఊసే లేదు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్, కనిగిరి నిమ్్జలను ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. విమానాశ్రయం సంగతి మరిచారు. నిరుద్యోగ భృతికి కేవలం రూ.500 కోట్లను కేటాయించటం చూస్తే బాబు సర్కారు చిత్తశుద్ధి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఆరోగ్యశ్రీని ఎ¯ŒSటీఆర్ వైద్యసేవగా మార్చినా మొత్తం బడ్జెట్లో వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిలే జిల్లా స్థాయిలో రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. ఇక డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి, రైతు రుణమాఫీలకు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లకుపైగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని బాబు సర్కారు గతంలో పలుమార్లు చెప్పినా బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. ఇక పేదలకు అడిగినన్ని గృహాలు కట్టిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చినా అవేమీ నెరవేరలేదు. తాజాగా లక్షల గృహాలు నిర్మిస్తామంటూ బాబు సర్కారు ప్రకటించిన ఆ స్థాయిలో నిధుల కేటాయింపుల్లేకపోవడం గమనార్హం. మొత్తంగా 2017-18 బాబు బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వెలిగొండకు వెయ్యికోట్లివ్వండి
► రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ► జిల్లాలోనే మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి ► పొగాకుకు కిలో రూ.165 ధర ఇవ్వాలి ► భూమా మరణం మమ్మల్ని బాధించింది ► ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వందలాది మంది మరణాలకు కారణమైన ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యమని, జిల్లా వాసులకు తాగు, సాగు నీటికి ఈ ప్రాజెక్టు ఏకైక మార్గమని ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెయ్యి కోట్ల రూపాయల నిధులిచ్చి వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . సోమవారం ఒంగోలులోని స్వగృహంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కారు సకాలంలో నిధులు కేటాయించకపోవడం వలనే ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యాయని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బాబు, మూడేళ్లు దాటుతున్నా పనులు పూర్తి చేయలేదన్నారు. మొక్కుబడి నిధుల కేటాయింపు వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు. తక్షణం వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెలిగొండ నీరు తప్ప జిల్లా వాసులకు మరో ఆధారం లేదన్నారు. ప్రస్తుతం గుక్కెడు తాగునీరు కూడా అందే పరిస్థితి లేదని చెప్పారు. తక్షణం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు నీళ్లు వస్తే ఫ్లోరైడ్ సమస్య తీరే అవకాశం ఉందన్నారు. గిట్టుబాటు ధరల్లేక జిల్లా రైతాంగం తీవ్ర నష్టాలపాలైందని, కందులు కొనే వారే లేరన్నారు. గతేడాది కందులు సైతం నిల్వ ఉన్నాయని చెప్పారు. కందికి గిట్టుబాటు ధర కల్పించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. మూడేళ్ల వరుస కరువుతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ఇక పొగాకు రైతులకు సైతం గిట్టుబాటు ధర లేదన్నారు. తీవ్రంగా నష్టపోయి దాదాపు 48 మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ ఆత్మహత్యలను నిరోధించాలంటే గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కిలో రూ.165కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డులు రైతులపై ఆంక్షలు పెట్టడం మాని వ్యాపారులను, దళారులను అదుపులో పెట్టాలని ఎంపీ సూచించారు. గిట్టుబాటు ధర రాక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతేడాది క్వింటాలు మిర్చి రూ.13 వేల వరకు ఉంటే ఈ ఏడాది రూ.4,500 మాత్రమే ధర ఉందని రైతులకు కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఎంపీ పేర్కొన్నారు. క్వింటా మిర్చి రూ.10 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు గుంటూరు మిర్చి యార్డుకు పంట తరలించాలంటే ట్రాన్స్‌పోర్టు అదనపు భారంగా మారిందన్నారు. ప్రకాశం జిల్లాలోనే మిర్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఎంపీ డిమాండ్ చేశారు. భూమా మరణం బాధించింది నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తమనెంతో బాధించిందని ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూమాను వైఎస్ కుటుంబంలో సభ్యులుగానే భావిస్తామన్నారు. ఆయన మృతితో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంతగా కలత చెందామని చెప్పారు. నాగి రెడ్డి పిల్లలకు దేవుడు మనోధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నామన్నారు. భూమా కుటుంబానికి రాజకీయాలకతీతంగా వైఎస్సార్ కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని ఎంపీ చెప్పారు. శోభానాగిరెడ్డి చనిపోవడమే ఆ కుటుంబానికి పెద్ద లోటుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో భూమా చనిపోవడం మరింత బాధాకరమన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్ నేత వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య
వెలిగొండ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలిగొండ మండలం నర్సాయిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాల వినోద్(24) ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించాడు. -
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన చంద్రబాబు
పోలవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖీ అయిన తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. చెప్పినట్లుగానే రుణమాఫీని అమలు చేశామని చంద్రబాబు అన్నారు. -
భూతంలా జలయజ్ఞం!
హైదరాబాద్: జలయజ్ఞాన్ని భూతంలా చూపించి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగానే సాగునీటి రంగంపై శ్వేతపత్రం రూపొందించడానికి కసరత్తు కొనసాగిస్తోంది. శ్వేతపత్రం రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మీద నిందలు మోపే విధంగా శ్వేతపత్రాన్ని రూపొందించాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముగింపు దశలో ఉన్న పులిచింతల, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ వంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉన్నా వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఫలితాలు అందుతాయి. అలాంటి ప్రాజెక్టుల పనుల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం జలయజ్ఞాన్ని భూతంలా చూపించాలని తాపత్రయపడుతోంది. ఇదే తపన ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చూపిస్తే వేలాది ఎకరాలకు నీరు అందేది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా పైసా ఇవ్వని విషయం తెలిసిందే. అయితే సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇదే జలయజ్ఞంపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంపై అధికారుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.