పద్మాపురంలో రెండు కాళ్లు లేని యోగమ్మను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే బుర్రా
వెలిగండ్ల: రాష్ట్రంలో మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి, పద్మాపురం, బొంతగుంట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హుస్సేన్‌పురం గ్రామ సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ బుక్‌లెట్‌ను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికీ చేకూరిన లబ్ధి వివరించారు.
హుస్సేన్‌పురంలో మంచంలో నడవలేని స్థితిలో ఉన్న యాదమ్మతో సీఎం జగనన్న మీ కుటుంబానికి మూడేళ్లలో వైఎస్సార్ పింఛన్ కానుక కింద రూ.82 వేలు ఇచ్చారన్నారు. సీఎం వైఎస్ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సారికూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే వస్తుందని యాదమ్మ బదులిచ్చారు. పద్మాపురంలో అక్కి యోగమ్మకి సుగర్ కారణంగా రెండు కాళ్లూ తీసివేయడం చూసి ఎమ్మెల్యే బుర్రా చలించిపోయారు. మూడు వేల పింఛన్ తీసుకుంటున్న యోగమ్మకు ఐదు వేల పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే బుర్రా ఆదేశించారు. తమ్మినేనిపల్లిలో తమ్మినేని పెద్దిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎమ్మెల్యే ఆయన్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం సేవలు అందించాలని రిమ్స్ వైద్యులను కోరారు. (క్లిక్: 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్..)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎంపీపీ రామన మహాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు గుంటక తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ సుకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు డి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘ అధ్యక్షుడు తమ్మినేని శివరామయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు యెలికె రమణయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు టి.దేవసహాయం, వై.నాగూర్‌యదవ్ , పీఏసీఎస్ చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, పొల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నాయకులు ఉండేల చిన వెంకటరెడ్డి, కర్నాటి చిన వెంకటరెడ్డి, రామకృష్ణ, వెంకటరెడ్డి, కె. వెంకట్రామయ్య, కె.అంకిరెడ్డి పాల్గొన్నారు. (క్లిక్: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్)
Comments
Please login to add a commentAdd a comment