Gadapa Gadapaku YSRCP programme
-
పగిడ్యాలలో గడప గడపకు మన ప్రభుత్వం
-
ఇంటింటికి వెళ్లి జనం సమస్యలు తీరుస్తున్న మంత్రులు, నేతలు
-
ఇడుపులపాయ పంచాయతీ వీరన్న గట్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి పర్యటన
-
గడప గడపపై వర్క్ షాప్
-
సంక్షేమం తలుపు తడుతోంది
(చిత్తూరు) నగరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సరీ్వసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం నగరి మండలం, దేశూరు అగరం గ్రామంలో ఆమె గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి మూడేళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును అంకెలతో సహా వివరించారు. నవరత్న పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు ఏయే సంక్షేమ పథకాలు అందాయి, వాటి ద్వారా ఎంత మేర లబ్ధి చేకూరిందో వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేశారు. సమస్యల కారణంగా పథకాల లబ్ధి ఆగిందని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఎందుకు ఆగిందో సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా తెలుసుకున్నారు. వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ అర్హులెవ్వరికీ అన్యా యం జరగకూడదని సచివాలయ సిబ్బందికి సూచించారు. మంచి చేస్తుంటే ఓర్వలేక కుట్రలు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేక కుట్ర రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే 95 శాతానికిపైగా ముఖ్యమంత్రి జగనన్న అమలు చేశారని గుర్తు చేశారు. ఏ పథకమైనా ప్రకటించిన తేదీల్లోనే లబి్ధదారులకు అంద జేస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీలు కన్నియప్పన్, ఢిల్లీ, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, హౌసింగ్ డీఈ శంకరప్ప, వెటర్నరీ ఏడీ వాసు, ఎంపీటీసీ సభ్యు లు గుణశేఖర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పరంధామరెడ్డి, శరత్ బాబు, దినకర్‌రెడ్డి, రామూర్తి రెడ్డి, రంగనాథం, మధు, సచి వాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
యజ్ఞంలా ‘గడప గడపకు మన ప్రభుత్వం’
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం యజ్ఞంలా జరుగుతోంది. మా అందరి సంక్షేమం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు చెబుతున్నారు. పథకాలతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని అనేకమంది ప్రజాప్రతినిధుల ఎదుట సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పలువురు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించిలబ్ధిదారులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ∙కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాళెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాజకీయ పారీ్టలు, కులమతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అందుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నామని చెప్పారు. ∙నెల్లూరు రూరల్ పరిధిలోని 31వ డివిజన్ పరిధిలో చవటమిట్ట గిరిజన కాలనీ, నిర్మల లేఅవుట్ ప్రాంతాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా, రాజకీయాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ∙కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని అల్లిమడుగు పంచాయతీ కడనూతలలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతి కుటుంబంతో మమేకమై పథకాల ద్వారా జరిగిన లబ్ధిని వివరించారు. గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా రామిరెడ్డి పదివేల ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రతినిధులు కడనూతల చేరుకుని ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. -
జగనే.. నా పెద్ద కొడుకు
ఎమ్మెల్యే : అవ్వా బాగున్నావా.. అవ్వ : బాగుండా నాయనా.. ఎమ్మెల్యే : పింఛన్ వస్తోందా.. అవ్వ : వస్తుందప్పా.. ఎమ్మెల్యే : ఎవరు ఇస్తున్నారవ్వా.. అవ్వ: ఇంకెవరు.. నా పెద్దకొడుకు జగన్ ఇస్తున్నాడు. ఎమ్మెల్యే : జగన్ అంటే ఎందకు అంత ప్రేమ అవ్వా.. అవ్వ : ఎందుకంటే నాయనా.. పుట్టిన కొడుకులే చూడటం లేదు. నెలనెలా ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు.. నా పెద్ద కొడుకుగా జగన్‌ను తలుచుకుంటూ ఉంటా.. కర్నూలు: అవ్వ పలుకులు వినగానే జనం మోముల్లో చిరునవ్వు పుట్టుకొచ్చింది. అవ్వ మాటలకు అందరూ ఒక్కసారిగా నవ్వారు. కూతురు వద్ద కాలం వెల్లదీస్తున్న అవ్వ సీఎం జగన్మోహన్రెడ్డి మీద కురిపించిన ప్రేమ నిజంగా అభినందనీయం. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చెట్నెహళ్లి గ్రామంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, మండల ఇన్చార్జ్ విశ్వనాథ్‌రెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామంలో 419 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు సైతం జగనన్నను ఎంతగానో ప్రేమిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మఒడి, వైఎస్సార్ పింఛన్ ఆసరా, రైతు భరోసా తదితర పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని గుర్తు చేశారు. నియోజకవర్గం ప్రగతి కోసం సర్వదా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎస్సీ కాలనీలో డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పారు. అలాగే గ్రామంలోని భీరలింగేశ్వరస్వామి ఆలయ వెనుక భాగంలో మట్టి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు అంజినయ్య, ఎంఈవో మొయినుద్దీన్, ఏపీఎం జయశ్రీ, ఏపీవో తిమ్మారెడ్డి, ఎస్ఐ చంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి భార్గవి, సర్వేయర్ హరికృష్ణ, ఏఈవో నరసింహుడు, నాయకులు వెంకటేశ్ , వీరనాగుడు పాల్గొన్నారు. -
మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే బుర్రా
వెలిగండ్ల: రాష్ట్రంలో మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి, పద్మాపురం, బొంతగుంట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హుస్సేన్‌పురం గ్రామ సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ బుక్‌లెట్‌ను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికీ చేకూరిన లబ్ధి వివరించారు. హుస్సేన్‌పురంలో మంచంలో నడవలేని స్థితిలో ఉన్న యాదమ్మతో సీఎం జగనన్న మీ కుటుంబానికి మూడేళ్లలో వైఎస్సార్ పింఛన్ కానుక కింద రూ.82 వేలు ఇచ్చారన్నారు. సీఎం వైఎస్ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సారికూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే వస్తుందని యాదమ్మ బదులిచ్చారు. పద్మాపురంలో అక్కి యోగమ్మకి సుగర్ కారణంగా రెండు కాళ్లూ తీసివేయడం చూసి ఎమ్మెల్యే బుర్రా చలించిపోయారు. మూడు వేల పింఛన్ తీసుకుంటున్న యోగమ్మకు ఐదు వేల పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే బుర్రా ఆదేశించారు. తమ్మినేనిపల్లిలో తమ్మినేని పెద్దిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎమ్మెల్యే ఆయన్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం సేవలు అందించాలని రిమ్స్ వైద్యులను కోరారు. (క్లిక్: 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్..) ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎంపీపీ రామన మహాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు గుంటక తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ సుకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు డి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘ అధ్యక్షుడు తమ్మినేని శివరామయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు యెలికె రమణయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు టి.దేవసహాయం, వై.నాగూర్‌యదవ్ , పీఏసీఎస్ చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, పొల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నాయకులు ఉండేల చిన వెంకటరెడ్డి, కర్నాటి చిన వెంకటరెడ్డి, రామకృష్ణ, వెంకటరెడ్డి, కె. వెంకట్రామయ్య, కె.అంకిరెడ్డి పాల్గొన్నారు. (క్లిక్: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్) -
దండాలయ్యా.. మాతో నువ్వుండాలయ్యా!
తిరుపతి : ‘అడిగితే తప్ప అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది అడగకుడానే అన్నీ ఇచ్చిన మీరు చల్లంగుండాలయ్యా’ అంటూ గడపగడపనా ప్రజలు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డిని ఆశీర్వదించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు తమ జీవితాలకు వెలుగులు ఇచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అందించలేనన్ని సంక్షేమ పథకాలు అందించిన జగనన్ననే మళ్లీ గెలిపించుకుంటామని చేతిలో చెయ్యేసి హామీ ఇచ్చారు. శుక్రవారం తిరుపతి నగరంలోని 46 డివిజన్లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. అడుగడుగునా హారతులు పట్టి ఆత్మీయంగా స్వాగతం పలికారు. -
చిన్నారితో ముచ్చటించిన ఉషశ్రీ చరణ్
-
గడప గడపకు మన ప్రభుత్వం
-
రాజమండ్రిలో గడప గడపకు వైఎస్ఆర్
-
ఒక్క పక్కా ఇల్లు కూడా లేదు
సీతారామపురం: ఇంతవరకు ఒక పక్కాఇల్లు కూడా మంజూరు చేయలేదని సింగారెడ్డిపల్లి బీసీ కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే మేకపాటì చంద్రశేఖర్‌రెడ్డి వద్ద వాపోయారు. మంగళవారం మండలంలోని సింగారెడ్డిపల్లి, ఎస్సీ, బీసీకాలనీలు, నాంచారంపల్లి గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సింగారెడ్డిపల్లి గ్రామంలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ఇచ్చిన 100 వాగ్దానాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజా బ్యాలెట్‌లోని విషయాలను స్థానికులకు వివరించారు. వర్షం వస్తే ఉరుస్తున్నాయి 30ఏళ్ళ క్రితం ఇళ్లు నిర్మించుకున్నామని వర్షం వస్తే ఉరుస్తూ ఇంటిలో నీరు చేరుతున్నాయని సింగారెడ్డిపల్లివాసులు వాపోయారు. నాయకులకు, అధికారులకు సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనంలేదని పరిష్కారం చూపాలని మేకపాటిని కోరారు. ఈ సందర్భంగా మేకపాటి స్పందిస్తూ.. ఎంపీ రాజమోహన్‌రెడ్డి నిధుల్లో ఇంటికి రూ.10 వేలు అందజేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మరుగుదొడ్లు, ఉపాధి బిల్లులు రాలేదని కొందరు స్థానికులు విన్నవించగా.. సమస్యను పరిష్కరించాలని స్థానిక సర్పంచ్‌కు మేకపాటి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు 600 అబద్ధాలుఆడి, ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. మాట ఇస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డిలా కట్టుబడి ఉండాలని అన్నారు. ఇంతలో ఓ వృద్ధుడు స్పందిస్తూ ‘వాళ్ల నాన్న రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడైన అబద్ధాలు ఆడి ఉంటే కదయ్యా.. జగన్ నోటి నుంచి అబద్ధాలు వచ్చేది.. ఆ వారసత్వమే కదా.. చేయగలిగితేనే చెబుతాడు.’ అని అనడంతో ఒక్కసారిగా చుట్టూ ఉన్నవాళ్లు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాణెం రమణయ్య, గోరంట్ల తిరుపాలు, సర్పంచ్ డి.పెంచలమ్మ, ఉపసర్పంచ్ పాణెం సుధాకర్‌గౌడ్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గాజుల పల్లి రామ్మోహన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, మాజీ ఎంపీపీ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు గుర్తిస్తున్నారు'
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు గుర్తిస్తున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నెల్లూరులో బుధవారం వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వై వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. బందరు పోర్టుకు లక్ష ఎకరాల సేకరణపై రైతులకు మద్దతుగా పోరాడతామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో పార్టీ అవసరాలకు అనుగుణంగా ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
వైజాగ్‌లో గడప గడపకు వైఎస్సార్సీపీ
-
కర్నూలు జిల్లాలో గడప గడపకు వైఎస్సార్సీపీ
-
గుంటూరులో గడప గడపకు వైఎస్సార్సీపీ