నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు గుర్తిస్తున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నెల్లూరులో బుధవారం వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వై వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.
బందరు పోర్టుకు లక్ష ఎకరాల సేకరణపై రైతులకు మద్దతుగా పోరాడతామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో పార్టీ అవసరాలకు అనుగుణంగా ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.