
ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment