కెనరా బ్యాంకు టెక్నాలజీ సేవలు | canara bank technology services | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంకు టెక్నాలజీ సేవలు

Published Sun, Jul 27 2014 2:03 AM | Last Updated on Tue, Aug 27 2019 4:29 PM

కెనరా బ్యాంకు  టెక్నాలజీ సేవలు - Sakshi

కెనరా బ్యాంకు టెక్నాలజీ సేవలు

సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు తన కస్టమర్ల కోసం ప్రవేశ పెట్టిన మూడు అధునాతన టెక్నాలజీ సేవలను బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఆర్‌కే దుబే శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘కెనరా ఎం-వాలెట్’ అనే టెక్నాలజీ సేవ ద్వారా మొబైల్ ఫోన్‌తో పౌర సేవల బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. మరో పథకం ‘కెనరా ఈజీ క్యాష్’ ద్వారా బ్యాంకింగ్ సదుపాయం లేని వారికి రూ.25 వేల వరకు నగదును పొందే వీలు కల్పించవచ్చని చెప్పారు.

 ఖాతాదారు తమ బంధువులు లేదా మిత్రులకు ఈ విధంగా పంపే మొత్తం కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇంకో పథకం ‘కెనరా పీ-సర్వ్’ ద్వారా చెక్‌బుక్ విజ్ఞప్తులు సమర్పించుకోవచ్చని, సేవింగ్స్ బ్యాంకు ఖాతాను ప్రారంభించుకోవచ్చన్నారు. కెనరా బ్యాంకు ఈ-లాంజ్‌లలో టచ్ స్క్రీన్‌తో కూడిన ఈ సదుపాయం ద్వారా 12 సేవలను పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement