
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం సుమారు 12 శాతం పెరిగింది. రూ. 281 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో ఇది రూ. 252 కోట్లు. ఇక తాజాగా తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 12,304 కోట్ల నుంచి రూ. 13,192 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ. 10,196 కోట్ల నుంచి రూ. 11,360 కోట్లకు చేరినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 10.56 శాతం నుంచి 11.05 శాతానికి పెరిగాయి.
అయితే, నికర నిరర్ధక ఆస్తులు మాత్రం 7.09 శాతం నుంచి 6.91 శాతానికి తగ్గాయి. విలువపరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ. 44,660 కోట్లుగాను, నికర ఎన్‌పీఏలు రూ. 26,694 కోట్లుగాను ఉన్నాయి. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ రూ. 2,270 కోట్ల నుంచి రూ. 2,466 కోట్లకు పెరిగింది. మొత్తం మీద కేటాయింపులు రూ. 2,582 కోట్లుగా ఉన్నాయి. బుధవారం బీఎస్‌ఈలో కెనరా బ్యాంకు షేరు 1.78 శాతం పెరిగి రూ. 257.60 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment