న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుక్రవారం అన్ని కాలపరిమితులపై రుణరేట్లను స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. కెనరాబ్యాంక్ కూడా ఇదే బాటన పయనించింది. కాగా ద్రవ్య లభ్యత బాగున్న నేపథ్యంలో డిపాజిట్ రేట్లనూ ఎస్‌బీఐ తగ్గించడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ నిర్ణయాల ప్రకటన మరుసటి రోజు బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు వర్తించే ఏడాది కాల వ్యవధి రుణ రేటు ప్రస్తుత 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గింది.
► రూ.2 కోట్లకన్నా తక్కువ ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్‌పై వడ్డీరేటు అలాగే రూ.2 కోట్ల పైబడిన బల్క్ టర్మ్ డిపాజిట్ రేటును బ్యాంక్ సవరించింది. రిటైల్ విభాగంలో డిపాజిట్ రేటు 10–50 బేసిస్ పాయింట్లు తగ్గగా, బల్క్ సెగ్మెంట్‌లో 25–50 బేసిస్ పాయింట్లు తగ్గింది.
► తగ్గించిన రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి.
కెనరాబ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలానికి ఈ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి 7 నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చింది.
బ్యాంకింగ్‌కు ఈనెలలోనే 50,000 కోట్లు!
బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని నిధులు లభ్యమయ్యే కీలక చర్యలకు ఆర్‌బీఐ శ్రీకారం చుడుతోంది. ఫిబ్రవరి 17, 24 తేదీల్లో రూ.50,000 కోట్ల రీపర్చేజింగ్ ఆపరేషన్స్ (రెపో) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సంబంధిత 2 రోజుల్లో రూ.25,000 చొప్పున రెపో ఆపరేషన్స్‌ను ఆర్‌బీఐ నిర్వహించనుంది. అయితే 17న మూడేళ్ల కాలవ్యవధి రెపో ఆపరేషన్‌కాగా, 24వ తేదీ రెపో ఆపరేషన్ ఏడాది కాల వ్యవధికి ఉద్ధేశించినది. దీనివల్ల బ్యాంకింగ్‌కు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయి. వడ్డీరే ట్లు మరింత తగ్గడానికి ఈ చర్యలు వీలుకల్పిస్తాయి.
వడ్డీరేటు తగ్గించిన ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్
Published Sat, Feb 8 2020 6:09 AM | Last Updated on Sat, Feb 8 2020 6:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment