
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ రూ.3,000 కోట్లు సమీకరించింది. బాసెల్– త్రి బాండ్ల ద్వారా ఈ నిధులు సమీకరించామని కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ బాండ్లకు కూపన్ (వడ్డీ)రేట్ 7.18 శాతమని, మొత్తం 20 సంస్థలకు ఈ బాండ్లను జారీ చేశామని పేర్కొంది. బాసెల్–త్రి మూలధన నిబంధనలను పాటించడానికి బ్యాంక్‌లు మూలధన ప్రణాళిక ప్రక్రియలను మెరుగుపరచుకోవడమే కాకుండా వాటిని శక్తివంతం చేసుకోవలసి ఉంటుంది. రుణ నాణ్యత సమస్యలను అధిగమించడానికి ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. కాగా 2013, ఏప్రిల్ 1 నుంచి బాసెల్ త్రి ప్రమాణాలు దశలవారీగా అమలవుతున్నాయి. రూ.3,000 కోట్ల మేర నిధులు సమీకరించినప్పటికీ, బీఎస్‌ఈలో కెనరా బ్యాంక్ షేర్ 4 శాతం నష్టంతో రూ. 117 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment