బెంగళూరు: కెనరా బ్యాంక్ బోర్డ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ. 12 డివిడెండ్ సిఫారసు చేయడంపై షేర్ హోల్డర్లు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన షేర్‌హోల్డర్ల 21 వార్షిక సార్వత్రిక సమావేశం యాజమాన్యంపై పూర్తి విశ్వాసాన్ని వెలిబుచి్చంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజును చిత్రంలో తిలకించవచ్చు. ఇదిలావుండగా, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా వ్యాపారులకు యూపీఐ చెల్లింపులను ఆఫర్ చేస్తున్నట్లు మరో ప్రకటనలో బ్యాంక్ తెలిపింది. తద్వారా ఈ తరహా సేవలు ప్రారంభిస్తున్న మొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా కెనరా బ్యాంక్ నిలిచిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment