Equity Share
-
డివిడెండ్‌పై హర్షం
బెంగళూరు: కెనరా బ్యాంక్ బోర్డ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ. 12 డివిడెండ్ సిఫారసు చేయడంపై షేర్ హోల్డర్లు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన షేర్‌హోల్డర్ల 21 వార్షిక సార్వత్రిక సమావేశం యాజమాన్యంపై పూర్తి విశ్వాసాన్ని వెలిబుచి్చంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజును చిత్రంలో తిలకించవచ్చు. ఇదిలావుండగా, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా వ్యాపారులకు యూపీఐ చెల్లింపులను ఆఫర్ చేస్తున్నట్లు మరో ప్రకటనలో బ్యాంక్ తెలిపింది. తద్వారా ఈ తరహా సేవలు ప్రారంభిస్తున్న మొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా కెనరా బ్యాంక్ నిలిచిందని పేర్కొంది. -
సాధారణ బీమా రంగంలోకి పేటీఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించేందుకు కావాల్సిన లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేయనున్నట్టు వెల్లడించింది. బీమా కంపెనీలో 74 శాతం ముందస్తు ఈక్విటీ కలిగి ఉంటామని కంపెనీ స్పష్టం చేసింది. సాధారణ బీమా విభాగంలో అపార వ్యాపార అవకాశాల నేపథ్యంలో తమ ప్రణాళిక విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నట్టు వివరించింది. రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్టు పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. కాగా, రుణ వ్యాపారం రూ.20,000 కోట్ల వార్షిక రన్ రేట్ కలిగి ఉందని పేటీఎం వెల్లడించింది. ఏప్రిల్‌లో రూ.1,657 కోట్ల విలువైన రుణాలను కస్టమర్లకు అందించినట్టు వివరించింది. గత నెలలో పేటీఎం వేదికగా జరిగిన లావాదేవీలు రూ.95,000 కోట్లకు చేరుకున్నాయి. నెలవారీ యూజర్ల సంఖ్య 7.35 కోట్లుగా ఉంది. -
మైండ్ ట్రీ డివిడెండ్ రూ.10
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.206 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.198 కోట్ల నికర లాభం వచ్చిందని, 4 శాతం వృద్ధి సాధించామని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.1,839 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.2,051 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ దేబాశిష్ చటర్జీ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం ఫ్లాట్‌గా 2.8 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం మాత్రం 6 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. నిర్వహణ లాభ మార్జిన్ ఒకటిన్నర శాతం పెరిగిందని, 40 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ సాధించామని వివరించారు. పూర్తి సంవత్సరానికి లాభం తగ్గింది: పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 16% తగ్గి రూ.631 కోట్లకు చేరగా, ఆదాయం మాత్రం 11% ఎగసి రూ.7,764 కోట్లకు పెరిగిందని చటర్జీ తెలిపారు. మార్చి నాటికి యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 307కు చేరిందని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,991గా ఉందని, అట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) 17.4%గా ఉందని వివరించారు. -
ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన ఎల్ అండ్ టీ
బెంగళూరు/న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.980కు (మంగళవారం ముగింపు ధర, రూ.950 కంటే ఇది రూ.30 అధికం) కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఓపెన్ ఆఫర్లో భాగంగా 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం ఎల్ అండ్ టీ రూ.5,030 కోట్లు కేటాయించింది. ఈ ఓపెన్ ఆఫర్ మే 14న ఆరంభమై అదే నెల 27న ముగుస్తుంది. అవసరానికి మించి బిడ్లు వస్తే, ఇష్యూ మేనేజర్లతో సంప్రదించి తగిన దామాషా ప్రాతిపదికన బిడ్లను అంగీకరిస్తారు. కాగా ఈ బలవంతపు ఓపెన్ ఆఫర్‌పై కసరత్తు చేయడానికి ఇండిపెండెంట్ డైరెక్టర్లతో కూడిన ఒక ప్యానెల్‌ను మైండ్‌ట్రీ కంపెనీ ఏర్పాటు చేసింది. మరోవైపు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పక్కన బెట్టింది. మైండ్ ట్రీని ఎల్ అండ్ టీ టేకోవర్ చేయడాన్ని మైండ్ ట్రీ వ్యవస్థాపకులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్
సాక్షి,ముంబై: నెస్లే ఇండియా లిమిటెడ్ భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2017 సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండ్‌ను సోమవారం ప్రకటించింది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ.33 చొప్పున ఈ డివిడెండ్ చెల్లించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఈ మూడవ తాత్కాలిక డివిడెండ్ చెల్లిస్తుంది. అర్హులైన పెట్టుబడిదారులకు డిసెంబరు 22నాటికి ఈ చెల్లింపు చేయనుంది. అలాగే డిసెంబర్ 12 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా ఇవాల్టి మార్కెట్లో నెస్లే ఇండియా లిమిటెడ్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 7680 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ 1:1 బోనస్ షేర్లు
⇒ క్యూ4లో నికర లాభం 38 శాతం అప్ ⇒ ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. జనవరి-మార్చి క్వార్టర్‌కు రూ.913 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. అంతక్రితం ఏడాది క్యూ4 లాభం(రూ.663 కోట్లు)తో పోల్చితే 38% వృద్ధి సాధించామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ ఉదయ్ కోటక్ వెల్లడించారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఒక్కో బోనస్ షేర్‌ను ఇవ్వాలన్న ప్రతిపాదనను, రూ.5 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ ఇవ్వడానికీ డెరైక్టర్ బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధి: వడ్డీయేతర ఆదాయం రెట్టింపు కావడంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఉదయ్ కోటక్ వెల్లడించారు. మొత్తం ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 4,782 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.6,172 కోట్లకు ఎగసిందని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.1,123 కోట్లకు, ఇతర ఆదాయం 94% వృద్ధితో రూ.1,018 కోట్లకు పెరిగాయని వివరించారు. స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.407 కోట్ల నుంచి 29% వృద్ధితో రూ.527 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.2,553 కోట్ల నుంచి రూ.3,249 కోట్లకు పెరిగాయన్నారు. ఐఎన్జీ వైశ్యా విలీన ప్రభావంతో కూడిన ఆర్థిక ఫలితాలు జూన్ క్వార్టర్ నుంచి ఉంటాయని ఉదయ్ కోటక్ తెలిపారు. ఎన్ఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 6.3 శాతం వృద్ధితో రూ.1,423కు చేరింది.