సాక్షి,ముంబై: నెస్లే ఇండియా లిమిటెడ్ భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2017 సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండ్‌ను సోమవారం ప్రకటించింది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ.33 చొప్పున ఈ డివిడెండ్ చెల్లించనుంది.
రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఈ మూడవ తాత్కాలిక డివిడెండ్ చెల్లిస్తుంది. అర్హులైన పెట్టుబడిదారులకు డిసెంబరు 22నాటికి ఈ చెల్లింపు చేయనుంది. అలాగే డిసెంబర్ 12 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా ఇవాల్టి మార్కెట్‌లో నెస్లే ఇండియా లిమిటెడ్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 7680 వద్ద ముగిసింది.
నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్
Published Mon, Dec 4 2017 5:55 PM | Last Updated on Mon, Dec 4 2017 6:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment