Nestle India Company
-
నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్
సాక్షి,ముంబై: నెస్లే ఇండియా లిమిటెడ్ భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2017 సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండ్‌ను సోమవారం ప్రకటించింది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ.33 చొప్పున ఈ డివిడెండ్ చెల్లించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఈ మూడవ తాత్కాలిక డివిడెండ్ చెల్లిస్తుంది. అర్హులైన పెట్టుబడిదారులకు డిసెంబరు 22నాటికి ఈ చెల్లింపు చేయనుంది. అలాగే డిసెంబర్ 12 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా ఇవాల్టి మార్కెట్లో నెస్లే ఇండియా లిమిటెడ్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 7680 వద్ద ముగిసింది. -
నెస్లేకు బాంబే హైకోర్టులో దక్కని ఊరట
ముంబై: మ్యాగీ నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆ కంపెనీ 9 రకాల నూడుల్స్‌ను నిషేధిస్తూ భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ గురువారం నెస్లే దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం కోర్టు విచారించింది. ఈ విషయంలో రెండు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికే షాపుల నుంచి ఆ ఉత్పత్తులను తొలగిస్తున్నందున ఈ దశలో నిషేధంపై స్టే విధించాల్సిన అవసరంలేదని ధర్మాసనం చెప్పింది. -
మ్యాగీపై నెస్లేకు చుక్కెదురు
ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలంటూ ఈనెల 5న ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నెస్లే విన్నపాన్ని తోసిపుచ్చింది. అయితే మ్యాగీ ఉత్పత్తుల నిషేధంపై దాఖలైన పిటిషన్ కు సంబంధించి ఆహార నాణ్యత, భద్రత సంస్థలు రెండు వారాల్లో వివరణతో కూడిన నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. -
నిషేధంపై నెస్లే పిటిషన్
ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ గురువారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈనెల 5న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. మహారాష్ట్రలో మ్యాగీ అమ్మకాలను నిషేధిస్తూ ఆహార భద్రత కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు. నెస్లే పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది.