
నెస్లేకు బాంబే హైకోర్టులో దక్కని ఊరట
ముంబై: మ్యాగీ నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆ కంపెనీ 9 రకాల నూడుల్స్‌ను నిషేధిస్తూ భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ గురువారం నెస్లే దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం కోర్టు విచారించింది. ఈ విషయంలో రెండు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికే షాపుల నుంచి ఆ ఉత్పత్తులను తొలగిస్తున్నందున ఈ దశలో నిషేధంపై స్టే విధించాల్సిన అవసరంలేదని ధర్మాసనం చెప్పింది.