మ్యాగీపై నెస్లేకు చుక్కెదురు | Bombay HC declines to stay order of food authorities banning 9 variants of Maggi noodles. | Sakshi
Sakshi News home page

మ్యాగీపై నెస్లేకు చుక్కెదురు

Published Fri, Jun 12 2015 4:50 PM | Last Updated on Mon, Oct 8 2018 4:21 PM

మ్యాగీపై నెస్లేకు చుక్కెదురు - Sakshi

ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ  దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలంటూ ఈనెల 5న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు.

 

దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నెస్లే విన్నపాన్ని తోసిపుచ్చింది. అయితే మ్యాగీ ఉత్పత్తుల నిషేధంపై దాఖలైన పిటిషన్ కు సంబంధించి ఆహార నాణ్యత, భద్రత సంస్థలు రెండు వారాల్లో వివరణతో కూడిన నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement