
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.206 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్‌లో రూ.198 కోట్ల నికర లాభం వచ్చిందని, 4 శాతం వృద్ధి సాధించామని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.1,839 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.2,051 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ దేబాశిష్ చటర్జీ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం ఫ్లాట్‌గా 2.8 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం మాత్రం 6 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. నిర్వహణ లాభ మార్జిన్ ఒకటిన్నర శాతం పెరిగిందని, 40 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ సాధించామని వివరించారు.
పూర్తి సంవత్సరానికి లాభం తగ్గింది: పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 16% తగ్గి రూ.631 కోట్లకు చేరగా, ఆదాయం మాత్రం 11% ఎగసి రూ.7,764 కోట్లకు పెరిగిందని చటర్జీ తెలిపారు. మార్చి నాటికి యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 307కు చేరిందని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,991గా ఉందని, అట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) 17.4%గా ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment