
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించేందుకు కావాల్సిన లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేయనున్నట్టు వెల్లడించింది. బీమా కంపెనీలో 74 శాతం ముందస్తు ఈక్విటీ కలిగి ఉంటామని కంపెనీ స్పష్టం చేసింది. సాధారణ బీమా విభాగంలో అపార వ్యాపార అవకాశాల నేపథ్యంలో తమ ప్రణాళిక విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నట్టు వివరించింది.
రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్టు పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. కాగా, రుణ వ్యాపారం రూ.20,000 కోట్ల వార్షిక రన్ రేట్ కలిగి ఉందని పేటీఎం వెల్లడించింది. ఏప్రిల్‌లో రూ.1,657 కోట్ల విలువైన రుణాలను కస్టమర్లకు అందించినట్టు వివరించింది. గత నెలలో పేటీఎం వేదికగా జరిగిన లావాదేవీలు రూ.95,000 కోట్లకు చేరుకున్నాయి. నెలవారీ యూజర్ల సంఖ్య 7.35 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment