న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మకు అదనపు వాటా లభించింది. చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సంస్థ యాంట్‌ఫిన్ విజయ్‌కు పేటీఎమ్‌లోగల 10.3 శాతం వాటాను బదిలీ చేసింది. అయితే ఈ వాటాకు సంబంధించిన ఆరి్థక హక్కులు(ఎకనమిక్ రైట్స్) యాంట్‌ఫిన్‌వద్దనే కొనసాగనున్నాయి.
కంపెనీ వాటాదారుల్లో ఒకటైన యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్ బీవీ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం 6,53,35,101 షేర్లను బదిలీ చేసినట్లు పేటీఎమ్ పేర్కొంది. దీంతో పేటీఎమ్‌లో యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.49 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో విజయ్ వాటా 19.55 శాతానికి
బలపడినట్లు వెల్లడించింది. వెరసి పేటీఎమ్‌లో విజయ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచినట్లు పేర్కొంది. వాటా బదిలీకిగాను యాంట్‌ఫిన్.. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఓసీడీలు)ను పొందనుంది. ఈ డీల్‌లో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపోగా.. షేరుకి రూ. 795 ధరలో వాటా బదిలీ
చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment