One 97 Communications
-
పేటీఎం జోరు.. నాలుగింతలు పైకి, ఏకంగా రూ. 6,292 కోట్లు
డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా రూ.6,292 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రుణాలు నాలుగింతలు అయ్యాయి. గత నెలలో రుణాలు అందుకున్న వారి సంఖ్య 27 లక్షల నుంచి 68 లక్షలకు ఎగసింది. అక్టోబర్–నవంబరులో రూ.2.28 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు పేటీఎం వేదిక ద్వారా జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ రెండు నెలల్లో లావాదేవీలు జరిపిన సగటు వినియోగదార్ల సంఖ్య 33 శాతం అధికమై 8.4 కోట్లకు చేరింది. డిజిటల్ రూపంలో నగదును స్వీకరించే పేటీఎం వర్తకుల సంఖ్య 55 లక్షలు ఉంది. చదవండి ‘మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా’..పిచాయ్ వార్నింగ్..ఆందోళనలో గూగుల్ ఉద్యోగులు! -
సాఫ్ట్‌బ్యాంక్.. పేటీఎం వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో 4.5 శాతం వాటా విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్‌డీల్ ద్వారా ఈ వాటాను 20 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1,627 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. షేరుకి రూ. 555–601.55 ధరల శ్రేణిలో వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. పేటీఎమ్ ఐపీవో తదుపరి లాకిన్ గడువు ముగియడంతో సాఫ్ట్‌బ్యాక్ వాటా విక్రయ సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షేరు పతనం బీఎస్ఈలో పేటీఎం షేరు బుధవారం(16న) 4 శాతం పతనమై రూ. 601.55 వద్ద ముగిసింది. ఈ ధరలో షేర్లను విక్రయిస్తే సాఫ్ట్‌బ్యాంక్‌కు 21.5 కోట్ల డాలర్లు లభిస్తాయి. 2017 చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌బ్యాంక్ 160 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఐపీవోలో 22 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీని విక్రయించింది. పేటీఎమ్‌లో ప్రస్తుత సాఫ్ట్‌బ్యాంక్ వాటా విలువ 83.5 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతోంది! చదవండి: భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
సాధారణ బీమా కోసం పేటీఎం జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: సాధారణ బీమా కోసం ‘పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్’ (పీజీఐఎల్) పేరుతో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) నిర్ణయం తీసుకుంది. ఆరంభంలో వన్ 97 కమ్యూనికేషన్స్‌కు పీజీఐఎల్‌లో 49 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 51 శాతం వాటా సంస్థ ఎండీ శేఖర్ శర్మకు చెందిన వీఎస్ఎస్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కలిగి ఉంటుందని స్టాక్ ఎక్సేంజ్‌లకు వన్ 97 కమ్యూనికేషన్స్ తెలియజేసింది. పీజీఐఎల్‌లో పదేళ్లలో రూ.950 కోట్లను వన్ 97 కమ్యూనికేషన్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడుల తర్వాత జాయింట్ వెంచర్ కంపెనీలో వన్ 97 వాటా 74 శాతానికి పెరుగుతుంది. శేఖర్ శర్మ సొంత సంస్థ వాటా 26 శాతానికి తగ్గుతుంది. ఐఆర్డీఏఐ నుంచి వచ్చే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌కు లోబడి పీజీఐఎల్ కార్యకలాపాల ప్రారంభం ఆధారపడి ఉంటుందని వన్ 97 కమ్యూనికేషన్స్ తెలిపింది. -
సాధారణ బీమా రంగంలోకి పేటీఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించేందుకు కావాల్సిన లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేయనున్నట్టు వెల్లడించింది. బీమా కంపెనీలో 74 శాతం ముందస్తు ఈక్విటీ కలిగి ఉంటామని కంపెనీ స్పష్టం చేసింది. సాధారణ బీమా విభాగంలో అపార వ్యాపార అవకాశాల నేపథ్యంలో తమ ప్రణాళిక విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నట్టు వివరించింది. రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్టు పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. కాగా, రుణ వ్యాపారం రూ.20,000 కోట్ల వార్షిక రన్ రేట్ కలిగి ఉందని పేటీఎం వెల్లడించింది. ఏప్రిల్‌లో రూ.1,657 కోట్ల విలువైన రుణాలను కస్టమర్లకు అందించినట్టు వివరించింది. గత నెలలో పేటీఎం వేదికగా జరిగిన లావాదేవీలు రూ.95,000 కోట్లకు చేరుకున్నాయి. నెలవారీ యూజర్ల సంఖ్య 7.35 కోట్లుగా ఉంది. -
పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను వీడని కష్టాలు..!
ఐపీఓ లిస్టింగ్ టైమ్‌లో అదరగొట్టిన కొత్త తరం టెక్ కంపెనీలు, ప్రస్తుతం చతికలపడుతున్నాయి. ఈ కంపెనీల బ్రాండ్‌ను చూసో లేదా బిజినెస్ మోడల్‌ను చూసో వెంట పడిన ఇన్వెస్టర్లు, తాజాగా ఈ షేర్లను వదిలించుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో, పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను కష్టాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 18న ఐపీఓకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఐపీఓకు వచ్చిన నాటి నుంచి షేర్ ధర పడిపోతూ వస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్లలో పేటీఎమ్ జాబితా చేసినప్పటి నుంచి సీఈవో విజయ్ శేఖర్ శర్మ రోజుకు సగటున రూ.128 కోట్లు కోల్పోయారు. పేటీఎమ్ ప్రతి షేరు ఐపీఓ ప్రారంభ ధర రూ.2150. అయితే, 3 నెలల తర్వాత ప్రతి షేరు షేర్ ధర ఇప్పుడు రూ.833 విలువతో ట్రేడ్ అవుతుంది. దీని అర్థం, కంపెనీలో దాదాపు 14 శాతం వాటా కలిగి ఉన్న విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత సంపద చివరి మూడు నెలల్లో 1.59 బిలియన్ డాలర్లు క్షీణించింది. అంటే, రోజుకు లెక్కిస్తే రూ.128 కోట్ల సంపద నష్ట పోయారు. పేటీఎమ్ స్టాక్ ధర రోజు రోజుకి భారీగా పడిపోతుంది. ఐపీఓ సమయంలో పేటిఎమ్ లో శర్మ వాటా సుమారు $2.6 బిలియన్లు ఉంటే, ఇప్పుడు అది కేవలం 998 మిలియన్ డాలర్లు. అయితే, ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం శర్మ మొత్తం మీద 1.3 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారు. అతను పేటిఎమ్ కంపెనీలో 57.67 మిలియన్ షేర్లను కలిగి ఉన్నారు. పేటీఎమ్ మార్కెట్ క్యాప్ లిస్టింగ్ రోజు నుంచి చూస్తే రూ.45,597 కోట్లు తగ్గింది. లిస్టింగ్ రోజు ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.1,01,400 కోట్లకు చేరుకోగా, ప్రస్తుతం రూ.55,802 కోట్లకు దిగొచ్చింది. (చదవండి: వచ్చేస్తున్నాడు.. డోనాల్డ్ ట్రంప్.. దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా..!) -
పేటిఎమ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న మిలీనియల్స్
పేటిఎమ్ మనీలో పెట్టుబడి పెట్టే మిలీనియల్స్ పెట్టుబడిదారుల సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. పేటిఎమ్ మనీ తన వార్షిక నివేదిక 2021ను విడుదల చేసింది. 2021లో పేటిఎమ్ మొత్తం వాటాలో మిలీనియల్స్ పెట్టుబడిదారులు దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నారు. పేటిఎమ్ బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇటీవల 2021 పేటిఎమ్ మనీ వార్షిక నివేదికను ప్రచురించింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపిఒలు), ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్ పిఎస్)తో సహా పేటిఎమ్ మనీ అందించే వివిధ ఉత్పత్తుల్లో పెట్టుబడులను ఈ నివేదిక వెల్లడించింది. 2021లో పేటిఎమ్ మనీలో ఎక్కువగా మిలీనియల్స్ పెట్టుబడులు పెట్టారని నివేదిక పేర్కొంది. ఈటిఎఫ్ లను కొనుగోలు చేసే మిలీనియల్స్ నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. మిలీనియల్స్ కొనుగోలు చేసిన ఈటిఎఫ్ సగటు సంఖ్య 50 శాతం పెరిగింది. ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే మిలీనియల్స్ నిష్పత్తి పరంగా సుమారు 11 శాతం పెరిగారు. 2020లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వారితో పోలిస్తే 2021లో 35 శాతం పెరిగారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం అనేక మంది మిలీనియల్స్ ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెడుతున్నారు. మహిళా పెట్టుబడిదారుల సంఖ్య 2020 కంటే రెట్టింపు అయింది. పెట్టుబడి పెట్టె మహిళల శాతం 114 వరకు పెరిగింది. దీనికి అదనంగా, ఎక్కువ శాతం మహిళా పెట్టుబడిదారులు పురుషల కంటే అధిక లాభాన్ని 2021లో సంపాదించారు. మిలీనియల్స్ అంటే? 1981-1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. ప్రపంచదేశాలతో పోలిస్తే ఆ జనాభా మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉంది. మొత్తం దేశ జనాభాలో వీరి సంఖ్య 400 మిలియన్లు (40 కోట్లు) ఉంటుంది. (చదవండి: Gold price: మళ్లీ పెరుగుతున్న బంగారం ధర..!) -
పేటీఎం యాప్‌లో మరో సరికొత్త ఆప్షన్.. అరచేతిలో ఆరోగ్య చరిత్ర!
హెల్త్ఐడీ క్రియేషన్ కోసం నేషనల్ హెల్త్ అథారిటీతో కలిసి పనిచేయనున్నట్లు వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ప్రకటించింది. దీని ద్వారా యూజర్లు తమ యూనిక్ హెల్త్ ఐడీని పేటీఎం యాప్ ద్వారా క్రియేట్ చేసు కోవచ్చు. భారతీయులందరికీ ఒకే చోట విస్తృత శ్రేణిలో ఉపయోగకరమైన సేవలను అందుబాటులోకి తీసుకు రావాలన్న కంపెనీ ప్రయత్నాలకు అనుగుణంగా హెల్త్ ఐడీ ఆవిష్కారం చోటు చేసుకుంది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లకు సంబంధించి హెల్త్ ఐడీల క్రియేషన్ కోసం వీలు కల్పించే అతిపెద్ద వినియోగదారు వేదికగా పేటీఎం నిలిచింది. భారతీయులకు సంబంధించి డిజిటల్ హెల్త్ రికార్డు క్రియేట్ చేసుకునేందుకు భారత ప్రభుత్వ హెల్త్ఐడీ క్రియేషన్ అనేది తప్పనిసరి. ఇది యూజర్లు వారు తమ హెల్త్ డేటాను యాక్సెస్ చేసేందుకు, తమ సమ్మతితో ఇతర ఆరోగ్య సంరక్షణ సంస్థలతో పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ హెల్త్ ఐడీ ద్వారా, యూజర్లు దీర్ఘకాలిక హెల్త్ హిస్టరీని క్రియేట్ చేసుకునేందుకు గాను హెల్త్ ఐడీతో తమ పర్సనల్ హెల్త్ రికార్డ్స్(పిహెచ్ఆర్) ను యాక్సెస్ చేయవచ్చు, లింక్ చేయవచ్చు. రాబోయే ఆరు నెలల్లో 10 మిలియన్లకు పైగా భారతీయులు తమ హెల్త్ ఐడీలు క్రియేట్ చేసుకునేలా చేయడమే కంపెనీ తన లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: ఎయిర్టెల్-టీసీఎస్ 5జీ ప్రయోగం విజయవంతం!) పేటీఎంపై తమ ఐడీలను క్రియేట్ చేసుకునే యూజర్లు తమ ల్యాబ్ రిపోర్ట్ లను పొందవచ్చు, యాప్ పై ఉండే హాస్పిటల్స్ తో టెలికన్సల్టేషన్స్ ను బుక్ చేసుకోవచ్చు. తమ సమాచారాన్ని అంతా కూడా సులభంగా హెల్త్ లాకర్ లో పొందుపర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా పేటీఎం యాప్ లోనే చేయవచ్చు. పేటీఎం మినీ యాప్ స్టోర్ ఒక హెల్త్ స్టోర్ ఫ్రంట్ ను కూడా ఆవిష్కరించింది. ఇది ఆరోగ్యసంరక్షణ రంగంలోని ప్రముఖ సంస్థలను అగ్రిగేట్ చేస్తుంది. దాంతో యూజర్లు టెలికన్సల్టేషన్స్ ను బుక్ చేసుకోవచ్చు, ఫార్మసీల నుంచి ఔషధాలు కొనుగోలు చేయవచ్చు, ల్యాబ్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య బీమా కొనుగోలు చేయవచ్చు, మెడికల్ రుణాలకు దరఖాస్తు చేయవచ్చు, ఇంకా మరెన్నో చూసుకునే వీలు ఇందులో ఉంది. దీని ద్వారా యూజర్లు తమ ఆరోగ్య పరమైన అన్ని అవసరాల కోసం పేటీఎం యాప్ పై ఆధారపడవచ్చు. గతంలోనే పేటీఎం డిజి లాకర్ ను తన మినీ యాప్ స్టోర్ కు అనుసంధానం చేసింది. యూజర్లు తమ డిజి లాకర్ ను పేటీఎం యాప్ నుంచే రిట్రైవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, సేవ్ / స్టోర్ చేసుకోవచ్చు, నమోది త సంస్థల నుంచి డాక్యుమెంట్ల వెరిఫైడ్ ఎలక్ట్రానిక్ కాపీలను నేరుగా వ్యక్తిగత లాకర్లలోకి పొందవచ్చు, తద్వా రా భౌతిక డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగించుకోవచ్చు. పేటీఎం ద్వారా కోవిడ్-19 టీకాను బుక్ చేసుకున్న యూజర్లు తమ వాక్సీన్ సర్టిఫికెట్లను ఒక్క క్లిక్ తో డిజిలాకర్ కు జోడించుకోవచ్చు. (చదవండి: శాంసంగ్ యూజర్లకు అలర్ట్...! వీటితో జాగ్రత్త..!) -
Paytm IPO: తొలి రోజే పేటిఎమ్ మదుపర్లకు భారీ షాక్!
ఇండియాలోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. సుమారు రూ.18,300 కోట్లను సేకరించడం లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్లోకి ఎంటరైంది. లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో ఐపీవో ధర రూ.2,150తో పోలిస్తే పేటీఎం షేరు విలువ 27.25% లేదా రూ.585.85 నుంచి రూ.1,564కు పడిపోయింది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 19.99% తక్కువగా ముగిసింది. నేటి సెషన్ ముగిసే సమయానికి సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టింగ్ సమయంలో పేటిఎమ్ మార్కెట్ క్యాప్ రూ.1.39 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,955తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. ఎన్ఎస్ఈలో షేరు 27.44% తక్కువగా రూ.1,560 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. (చదవండి: యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..!) పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080-2,150గా కంపెనీ నిర్ణయించింది. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు తీపికబురు) -
రూ.7,000 కోట్లు సమీకరించిన పేటీఎమ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ తాజాగా వంద కోట్ల డాలర్లు(రూ.7,000 కోట్లు) సమీకరించింది. అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ టీ రోవె ప్రైస్‌తో పాటు పేటీఎమ్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబా, డిస్కవరీ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఓసీఎల్) పేర్కొంది. ఈ తాజా రౌండ్లో చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ నుంచి 40 కోట్ల డాలర్లు వచ్చాయని పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు. ఈ తాజా పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే పేటీఎమ్ కంపెనీ విలువ 1,600 కోట్ల డాలర్ల (రూ.1,12,000 కోట్లు)మేర ఉంటుందని వివరించారు. మూడేళ్లలో ఆర్థిక సేవల విస్తరణ కోసం రూ.10,000 కోట్లు (140 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని తెలిపారు. 2021లో లిస్టింగ్ ! భారత్ డిజిటల్ చెల్లింపుల రంగంలో గూగుల్ పే, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే, ఇతర సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో పేటీఎమ్ ఈ స్థాయిలో పెట్టుబడులు సమీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2012లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలని ఈ కంపెనీ యోచిస్తోంది. రూ.3,960 కోట్ల నష్టాలు.... ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో 30 కోట్ల డాలర్లను పేటీఎమ్ సమీకరించింది. పేటీఎమ్‌కు చెందిన మాతృసంస్థ ఏసీఎల్‌కు 2017–18లో రూ.1,490 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,960 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. -
చెల్లింపుల బ్యాంక్‌లో పేటీఎం వాలెట్ వ్యాపారం విలీనం
న్యూఢిల్లీ: త్వరలో ఏర్పాటు చేయనున్న చెల్లింపుల బ్యాంకులో వాలెట్ వ్యాపార విభాగాన్ని విలీనం చేయనున్నట్లు పేటీఎం మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ వెల్లడించింది. వాలెట్ విభాగం వ్యాపారం మొత్తం పేమెంట్స్ బ్యాంకుకు బదలారుుస్తామని, అమ్మకాల భాగాన్ని మాత్రమే వన్97 నిర్వహిస్తుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. చెల్లింపుల బ్యాంకుకు సంబంధించి ఆర్బీఐ నుంచి తుది అనుమతులు పొందే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వివరించారు. చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 680 మిలియన్ డాలర్లు సమీకరించిన వన్97 కమ్యూనికేషన్స... ఇటీవలే పేటీఎం ఈ-కామర్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేరిట రెండు వేర్వేరు సంస్థలను నమోదు చేసింది. పేమెంట్స్ బ్యాంక్‌లో వన్97 వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మెజారిటీ వాటాలుంటారుు.