న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం సుమారు 41 శాతం క్షీణించి రూ. 479 కోట్లకు పరిమితమైంది. మొండిబకాయిల కోసం అధిక కేటాయింపులు చేయడం ఇందుకు కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో బ్యాంక్ నికర లాభం రూ. 807 కోట్లు. తాజా త్రైమాసికంలో ఆదాయం రూ. 11,728 కోట్ల నుంచి రూ. 12,253 కోట్లకు పెరిగింది. ప్రొవిజనింగ్ 72 శాతం ఎగిసి రూ. 788 కోట్ల నుంచి రూ. 1,360 కోట్లకు చేరింది. అటు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 2.67 శాతం నుంచి 3.98 శాతానిఇక ఎగిశాయి.
నికర ఎన్‌పీఏలు కూడా 2.03 శాతం నుంచి 2.74 శాతానికి పెరిగాయి. ఇక సవరించిన వేతన బకాయిల కింద కెనరా బ్యాంకు రూ. 151 కోట్లు ప్రొవిజనింగ్ చేసింది. అటు రూ. 370.08 ప్రీమియంతో ఎల్‌ఐసీకి 4 కోట్ల షేర్లు కేటాయించింది. వీటి విలువ రూ. 1,520 కోట్లు. మొండి బకాయిల కారణంగా రాబోయే క్వార్టర్లలో ఒత్తిడి పెరగకుండా ముందస్తుగా అధిక కేటాయింపులు చేయడం వల్ల లాభాలు తగ్గాయని కెనరా బ్యాంక్ ఈడీ పీఎస్ రావత్ తెలిపారు. ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు రూ. 2,000 కోట్ల విలువ చేసే ఎన్‌పీఏలను విక్రయించే ప్రక్రియ ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
కెనరా బ్యాంక్ లాభం 41% డౌన్
Published Thu, Aug 6 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement
Advertisement