కెనరా బ్యాంక్‌లో 550 ఖాళీలు
కెనరా బ్యాంకు.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు
మేనేజర్ (ఎంఎంజీఎస్ గ్రేడ్-2)
పోస్టుల సంఖ్య: 450; విభాగం: జనరలిస్ట్
అర్హతలు: ఏదైనా డిగ్రీ/పీజీతోపాటు సీఏఐ ఐబీ/రిస్క్ మేనేజ్‌మెంట్/ట్రెజరీ మేనే జ్‌మెంట్/ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో డిప్లొమా ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య
సీనియర్ మేనేజర్(ఎంఎంజీఎస్ గ్రేడ్-3)
పోస్టుల సంఖ్య: 100; విభాగం: క్రెడిట్
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సీఏఐఐబీ/ సీఏ/ఎంబీఏ/ పీజీడీబీఎం /పీజీడీబీఏ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లోని క్రెడిట్ విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుతం ఎంఎం జీఎస్ గ్రేడ్-2గా పనిచేస్తూ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 27 నుంచి 40 ఏళ్ల మధ్య
ఎంపిక:అకడెమిక్ మెరిట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 26
చివరి తేది: సెప్టెంబరు 5
వెబ్‌సైట్: www.canarabank.com
ఏపీఐఐసీలో స్టూడెంట్ ట్రైనీలు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఐఐసీ).. తాత్కా లిక పద్ధతిలో స్టూడెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టు: స్టూడెంట్ ట్రైనీ
అర్హతలు: కాస్ట్ అకౌంటెంట్/చార్టెడ్ అకౌంటెంట్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును పోస్టు ద్వారా పంపాలి.
చివరి తేది: ఆగస్టు 31
చిరునామా: ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఏపీఐఐసీ లిమిటెడ్, ఫిఫ్త్ ఫ్లోర్, పరిశ్రమ భవన్, బషీర్‌బాగ్, హైదరాబాద్-500004
ఉద్యోగాలు
Published Tue, Aug 27 2013 11:44 PM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement