
బెంగళూరు: కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 15 శాతం పెరిగి రూ.300 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కెనరా బ్యాంక్ తెలియజేసింది. ఆదాయం 6 శాతం పెరిగి రూ.12,679 కోట్లకు చేరుకుంది. రుణాలు 14 శాతం వృద్ధి చెందాయని, గత క్యూ2లో 11.05 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 10.56 శాతానికి తగ్గాయని బ్యాంకు పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 6.91 శాతం నుంచి 6.54 శాతానికి తగ్గాయని వివరించింది.
సిండికేట్ బ్యాంక్ నష్టాలు రూ.1,543 కోట్లు
ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు రెండో త్రైమాసికంలో రూ.1,543 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు బాగా పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,419 కోట్ల నుంచి రూ.5,889 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 9.39 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 12.98 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 5.76 శాతం నుంచి 6.83 శాతానికి పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment