‘‘జీవితంపై నేను పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. కలలు కరిగి పోయాయి. భవిష్యత్తు నాశనం అయ‍్యింది. బయట జీవించడం కంటే నేను జైల్లో చనిపోతేనే బాగుంటుంది.’’ ఇంతకీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఒప్పుడు విమానయాన రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి పాతాళంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేష్ గోయల్
జెట్ ఎయిర్‌వేస్.. ప్రైవేట్ విమానయాన రంగంలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన సంస్థ. ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఇది ఒకటి. కానీ అదంతా గతం.. ఇప్పుడు పెరిగిన అప్పులతో కుప్పకూలిపోయింది. 200కిపైగా విమానాలతో నడిచే ఈ సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా, 1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయిన కంపెనీ అదాళ పాతంలోకి కూరుకుపోయింది.
పిలిస్తే పలికే నాధుడు లేక
ఫలితంగా నిన్నమొన్నటి వరకు ఏవియేషన్ రంగాన్ని శాసించి .. సంస్థను వరుస లాభాలతో పరుగులు పెట్టించిన జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేష్ గోయల్ దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. జీవిత చరమాంకంలో పెరిగిన అప్పులు, వెంటాడుతున్న కేసులు, చుట్టు ముట్టిన అనారోగ్య సమస్యలు. వెరసి శరీరం సహరించిక.. పిలిస్తే పలికే నాధుడు లేక. ఆ బాధనుంచి బయట పడడానికి న్యాయమూర్తిని చావు శరణు కోరారు.
మనీలాండరింగ్ కేసులో
కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై ఉన్న ఆయన ఇప్పటికే పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
కోర్టులో చేతులు జోడించి.. జైల్లో నరకయాతన
రోజులన్నీ ఒకేలా ఉండవు. ఒకప్పుడు భార్య, కుమార్తె.. వేలల్లో ఉద్యోగులు.. వందల్లో విమానాలు.. కోట్లలో లావాదేవీలు చేసిన నరేష్ గోయల్ పరిస్థితి తలకిందులైంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగే ముందే కొన్ని నిమిషాల పాటు తనని వ్యక్తిగతంగా విచారణ చేయాలని గోయల్ ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి ఎంజే దేష్ పాండేను కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో.. జెయిట్ ఎయిర్‌వేస్ అధినేత ఎదుట చేతులు జోడించి ‘‘ వయస్సు రిత్యా తన రోజువారి ఆటకం ఏర్పడుతుంది. జైలు సిబ్బంది అందుకు సహకరించినా అవి సరిపోవడం లేదని, తాను పడుతున్న బాధ పగవాడికి కూడ రావొద్దని.. జైల్లో నరకయాతన పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇకపై నేను ఇలాంటివి భరించలేను
తాను బలహీనంగా ఉన్నానని, చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేదని గోయల్ న్యాయమూర్తికి తెలిపారు. ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో జైలు సిబ్బంది, ఎస్కార్ట్ వాహనంతో పాటు ఇతర ఖైదీలతో ప్రయాణం చేయడం ఒత్తిడి గురై బతుకు దుర్భరంగా మారింది. ఇకపై నేను ఇలాంటివి భరించలేను. జేజే ఆస్పత్రిలో ఎప్పుడూ పెద్ద క్యూ ఉంటుంది. ఇతర అనారోగ్య బాధితులకు చికిత్స అందించి.. డాక్టర్ల నా వంతుగా వైద్యం చేసేందుకు మరింత సమయం పడుతుంది. ఇలాంటి పరిణామాలు నా ఆరోగ్యంపై దుష్ప్రప్రభావాన్ని చూపుతున్నాయి.
జైల్లో చనిపోవడమే మంచిది
నాకు 75 ఏళ్లు నిండాయి. భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేదు. నేను జైలులో చనిపోవాలనుకున్న ప్రతి సారి విధి నన్ను కాపాడుతుంది. జీవితంపై నేను పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. కలలు కరిగి పోయాయి. భవిష్యత్తు నాశనం అయ‍్యింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవించి ఉండటం కంటే జైల్లో చనిపోవడమే మంచిది అందుకు అనుమతించండి" అని కోర్టు ఎదుట మొకరిల్లాడు.
కన్నీటి పర్యంతరం
నా భార్య అనిత క్యాన్సర్ ముదిరిపోయి చికిత్స పొందుతోంది. ఒక్కగానొక్క నమ్రత గోయల్ కూతురు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఆమెను చూసుకునే వారు లేరని కన్నీటి పర్యంతమయ్యారు గోయల్.
తనను జెజె ఆసుపత్రికి పంపవద్దని, బదులుగా ‘‘ జైలులోనే చనిపోవడానికి అనుమతించండి’’ అని కోర్టును అభ్యర్థించాడు. చివరిగా.. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. ఇప్పుడు కోర్టుకు హాజరయ్యాను. ఇకపై కోర్టు అడిగిన ఆధారాల్ని సమర్పిస్తాను. కానీ భౌతికంగా కోర్టుకు హాజరు కాలేనని చెప్పాడు.
జనవరి 16న తదుపరి విచారణ
గోయల్ అభ్యర్ధనను విన్న ప్రత్యేక న్యాయ మూర్తి.. జెట్ ఎయిర్ వేస్ నరేష్ గోయల్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా నరేష్ గోయల్ బెయిల్ పిటిషన్‌పై ఈడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణ జనవరి 16 న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment