సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది.
వివరాల ప్రకారం.. విశాఖ పోర్టు డ్రగ్స్ కేసుపై సీబీఐ దృష్టిసారించింది. ఈ క్రమంలో సంధ్యా ఆక్వాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. అలాగే, లిక్కర్ స్కాంకు పాల్పడిన సిండికేట్‌లో సంధ్యా ఆక్వా భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీంతో.. మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును చేధించే పనిలో సీబీఐ దూకుడు పెంచింది.
ఇక, పది మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్యా ఆక్వా కంపెనీలో సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కంపెనీని పరిశీలించారు. ఇదే సమయంలో కంటైనర్లలో మెటీరియల్‌కు సంబంధించి మరిన్ని శాంపిల్స్‌ను విశాఖలో పరిశీలించగా ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది.
ఇది కూడా చదవండి: విశాఖ డ్రగ్స్ కేసు: చంద్రబాబు ఇంగితం లేని మాటలు
Comments
Please login to add a commentAdd a comment