
లియోనియా రిసార్ట్స్
హైదరాబాద్: నగర శివార్లలో శామీర్‌పేట మండలం బొమ్మరాస్‌పేట వద్ద ఉన్న లియోనియా (లియో మెరిడియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ లిమిటెడ్) రిసార్ట్ప్పై బెంగళూరు సీబిఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ 11 బ్యాంకులలో అక్రమంగా 650 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తప్పుడు భూమి పత్రాలతో ఈ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆరోపణల నేపధ్యంలో సీబిఐ కేసు నమోదు చేసింది. శామీర్‌పేటలోని 116 ఎకరాల్లో లియోనియా రిసార్ట్స్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ అక్రమంగా రుణాలు పొందడమే కాకుండా, భూములు కూడా ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.