
‘సీబీఐ కేసులకు భయపడుతున్న కేసీఆర్’
హైదరాబాద్: సీబీఐ కేసులకు భయపడే సీఎం కేసీఆర్ మోడీ తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సహారా ప్రావిడెంట్ ఫండ్ మినహాయింపు కేసులు సీఎం కేసీఆర్ పై ఉన్నాయి. ఈ కుంభకోణం యూపీఏ హయంలోనే జరిగిందని అయితే అది ఇప్పుడు బయటపడిందని అన్నారు. కుంభకోణం జరగలేదని , తనపై కేసులు లేవని కేసీఆర్ ఖండించగలరా అని నిలదీశారు.
జీఎస్టీ వల్ల తెలంగాణకు రూ.19 వేల కోట్ల నష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల చెబుతున్నారు. మరోపైపు మాత్రం జీఎస్టీ ఈవెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలంతా పాల్గొన్నారని ఆయన అన్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంటని ప్రశ్నించారు. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.