
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాల్లో అక్రమాలకు పాల్పడిన గుంటూరులోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలోని పలువురు అధికారులపై సీబీఐ బుధవారం కేసులు నమోదు చేసింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల, గుంటుపల్లి తదితర చోట్ల ఈపీఎఫ్ అధికారులకు చెందిన 40 నివాసాలు, ఇతర ప్రదేశాలపై సీబీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఈపీఎఫ్ అధికారులు కొందరు ప్రైవేటు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ గుర్తించింది. ఈపీఎఫ్ క్లెయిములు, సేవలు, ఉద్యోగులకు బకాయిల చెల్లింపు వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. అందుకోసం గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే మొదలైన మొబైల్ వాలెట్ల ద్వారా భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా ఆధారాలు సేకరించింది. అక్రమాలకు పాల్పడిన ఈపీఎఫ్ అధికారులపై 4 కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment