న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన రోజుల వ్యవధిలోనే ఆ సంస్థలోని మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో అలోక్‌వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా కూడా ఉన్నారు. అస్థానాతోపాటు జేడీ అరున్ కుమార్ శర్మ, డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ నైక్నవారేల పదవీకాలాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment