![Enforcement Directorate Attacks For Delhi Liquor Scam - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/8/ENFORCEMENTF.jpg.webp?itok=8amuEOdr)
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు శుక్రవారం మళ్లీ దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల అధికారులు దాడులు కొనసాగించారు. అలాగే బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్‌లోనూ దాడులు సాగాయి. మాదాపూర్‌కు చెందిన అభినవ్‌రావ్, ఓ తెలుగు దినపత్రికలో పెట్టుబడులు పెట్టిన అభిషేక్‌రెడ్డి, ఎం.గోపాలకృష్ణ, కూకట్‌పల్లికి చెందిన మరో వ్యక్తి ఇంట్లో దాడులు నిర్వహించారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ ముందుగా సోదాలు జరిపింది. దినేష్ అరోరా ఇంటితో పాటు ఆఫీస్, అతని స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏ11గా ఉన్న దినేష్‌కు చెందిన అకౌంట్‌లోకి సమీర్ మహేంద్రు ద్వారా రూ.కోటి నగదు బదిలీ జరిగింది.
ఈ కోణంలో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమీర్ మహేంద్రును ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అతను ఇచ్చిన వాంగ్మూలంతోనే అధికారులు నాలుగు చోట్ల సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment