తృణమూల్‌ ఎంపీలు, మంత్రులపై సీబీఐ కేసు | Narada sting: CBI files FIR against 12 Trinamool leaders | Sakshi
Sakshi News home page

తృణమూల్‌ ఎంపీలు, మంత్రులపై సీబీఐ కేసు

Published Tue, Apr 18 2017 2:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

Narada sting: CBI files FIR against 12 Trinamool leaders

న్యూఢిల్లీ: నారద స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్‌ మంత్రులతో పాటు ఓ ఐపీఎస్‌ అధికారిపై సీబీఐ కేసు నమో దు చేసింది. కుట్రపూరిత నేరం, అవినీతి తదితర సెక్షన్ల కింద రాజ్యసభ ఎంపీ ముకుల్‌ రాయ్, లోక్‌సభ సభ్యులు సుల్తాన్‌ అహ్మద్, సౌగతా రాయ్, కకోలీ ఘోష్‌ దస్తీదార్, అపురూప పొద్దర్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ దుయ్యబట్టారు. 2016 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచాక లబ్ధి చేకూరుస్తామన్న తృణమూల్‌ నేతలు డబ్బులు పుచ్చుకుంటూ స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement