narada sting operation
-
అది సభా హక్కుల ఉల్లంఘనే
కోల్‌కతా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బుధవారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటప్పుడు ముందస్తుగా సమాచారం అందివ్వలేదని అది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ తీర్మానం పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి తపస్ రాయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకి సంబంధించి ఈ ఏడాది మొదట్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని, వారిని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకర్ బిమన్ బెనర్జీ అనుమతి తీసుకోలేదని, ఆయనకు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందివ్వలేదని తపస్ రాయ్ చెప్పారు. ఈడీ కూడా వారి ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిందని వెల్లడించారు. సీబీఐ, ఈడీ సభా హక్కుల్ని ఉల్లంఘించారని, స్పీకర్‌కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర సింగ్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్ బిశ్వాస్‌పై సభా హక్కుల ఉల్లంఘనను ప్రవేశపెడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ అంశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీ హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు. -
Narada Sting Case: టీఎంసీ నేతలకు ఝలక్
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ప్రత్యేక కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించింది. పశ్చిమ బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రత్యేక కోర్టు ఛార్జ్షీట్లోని నలుగురు టీఎంసీ నేతలకు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 16హాజరు కావాలని పేర్కొంది. టీఎంసీ నేతలతో పాటు సస్పెండ్ చేయబడిన ఐపీఎస్ అధికారి ఎస్ఎంహెచ్ మీర్జాకు కూడా కోర్టు నోటీసు పంపింది. చదవండి: అమరవీరులను అవమానించడమే ముఖర్జీ, హకీమ్, మిత్రాకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ద్వారా సమన్లు అందజేయాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన ఇద్దరికి నేరుగా వారి చిరునామాలకు సమన్లు పంపిస్తున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాది సీబీఐ ముఖర్జీ, హకీమ్, మిత్రా, సోవన్ ఛటర్జీలను అరెస్ట్ చేయగా.. వారికి మే నెలలో కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చదవండి: పనిచేస్తారా? తప్పుకుంటారా.. పార్టీ శ్రేణులకు కమల్ వార్నింగ్! తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
నారద కేసు: టీఎంసీ నేతలకు ఊరట
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో నలుగురు టీఎంసీ నేతలకు కలకత్తా హైకోర్టు శుక్రవారం తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. రూ.2 లక్షలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి న్యూస్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. టీఎంసీ నేతలు ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీ, సోవన్ ఛటర్జీలను మే 17న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా వీరికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన కోర్టు.. నిబంధనలు ఉల్లఘింస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక కేసుకు సంబంధించి కోర్టుకు ఏమైనా అవసరం వస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దర్యాప్తులో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంపెక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యాపార ప్రయోజనాలు కల్పించేందుకు వీరు నగదును తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించారు. స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసమే ఈ కల్పిత సంస్థను శామ్యూల్ సృష్టించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినవారిలో ముకుల్ రాయ్, సౌగత రాయ్, కకోలీ ఘోష్ దస్తిదార్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, అపరుప పొద్దార్, సుల్తాన్ అహ్మద్, మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీ, సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఇక్బాల్ అహ్మద్, షంకు దేబ్ పాండా సహా ఐపీఎస్ అధికారి హెచ్ఎంఎస్ మీర్జా ఉన్నారు. చదవండి: నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ నారదా స్టింగ్ ఆపరేషన్: మంత్రులకు బెయిల్ -
నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వల్లే సీబీఐ కార్యాలయంపై తృణమూల్ పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని సీబీఐ కోల్‌కతా హైకోర్టుకు వివరించింది. నారదా కేసును రాష్ట్రం వెలుపల విచారించేలా కేసు బదిలీకి అనుమతివ్వాలని, అరెస్టయిన నలుగురు నిందితులనూ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ బుధవారం కోర్టును కోరింది. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో రెండు రోజుల క్రితం సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు స్థానిక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయడంతో, వెంటనే సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. దాంతో నిందితుల బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది నేడు కోల్‌కతా హైకోర్టు ఈ కేసును విచారించింది. సీబీఐ ఆఫీసు ముందు ముఖ్యమంత్రి అధ్వర్యంలో తృణమూల్ కార్యకర్తలు భయోత్పాతం సృష్టించడం వల్లే సోమవారం కోర్టుకు వచ్చి నిందితుల కస్టడీని కోరలేకపోయామని సీబీఐ వివరించింది. భారీ గుంపులను తీసుకొని వచ్చిన మమత.. సీబీఐ ఆఫీసు ముందు నానా రచ్చ చేశారని ఆరోపించింది. ఆమె రెచ్చగొట్టడం వల్లే వేలాది మంది దుండగులు సీబీఐ ఆఫీసుపైకి రాళ్లు విసిరారని పేర్కొంది. సీబీఐ అధికారులను బెదిరించి, భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించింది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా మమత సర్కార్ అడ్డుకుంటోందని ఆక్షేపించింది. అలాంటి సందర్భంలో నిందితులను కోర్టుకు తీసుకొస్తే.. దారి మధ్యలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తొచ్చన్న ఉద్దేశంతోనే సోమవారం కోర్టుకు రాలేదని సీబీఐ పేర్కొంది. చదవండి: West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం -
నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రుల అరెస్ట్
కోల్‌కతా: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో పశ్చిమ బెంగాల్లో అరెస్టుల పర్వం సోమవారం మొదలైంది. ఈ కేసులో టీఎంసీ నేతృత్వంలోని బెంగాల్ సర్కార్‌లో మంత్రులుగా ఉన్న ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. మరో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, రాష్ట్ర మాజీ మంత్రి సోవన్ ఛటర్జీలనూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. రోజంతా హైడ్రామా నడిచింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అరెస్టుల విషయం తెల్సి మమత వెంటనే సీబీఐ ఆఫీస్‌కు వచ్చి దాదాపు ఆరుగంటలపాటు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు, ఈ నలుగురికీ బెయిల్ మంజూరుచేస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం సోమవారం రాత్రి హైకోర్టు వీరి బెయిల్‌పై స్టే ఇచ్చింది. అరెస్టులను నిరసిస్తూ టీఎంసీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలను గాలికొదిలేసి నిరసన చేపట్టారు. అరెస్టులు చట్టవిరుద్ధం: స్పీకర్ ‘ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలంటే ప్రొటోకాల్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌గా నాకు ముందే సమాచారమివ్వాలి. అలాంటి లేఖలు ఏవీ నాకు సీబీఐ నుంచి రాలేదు. ఇలా స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేల అరెస్ట్ చట్టవిరుద్ధం’ అని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నలుగురు నేతల అరెస్టుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ గతంలో అనుమతులు ఇవ్వడం గమనార్హం. నన్నూ అరెస్ట్ చేయండి: మమతా బెనర్జీ అరెస్టుల విషయం తెల్సుకున్న టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వెంటనే కోల్‌కతాలో సీబీఐ కార్యాలయం ఉన్న ‘నిజాం ప్యాలెస్’ భవంతికి వచ్చి ధర్నా చేపట్టారు. అరెస్టులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘సీబీఐ ఆఫీస్ నుంచి వెళ్లేదేలేదు. కావాలంటే నన్నూ అరెస్టు చేయండి’ అని అక్కడ ఉన్న సీబీఐ సిబ్బందితో మమత ఆగ్రహంగా అన్నారు. అరెస్టు చేశాక ఆ నలుగురు నేతలను సీబీఐ అధికారులు బిల్డింగ్‌లోని 15వ అంతస్తులోని ఒక రూమ్‌కు తీసుకెళ్లారు. మమత ఆ రూమ్ బయటే నిరసన తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు ఆమె సీబీఐ కార్యాలయంలోనే ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకొని వేధింపులకు దిగుతోందని తృణమూల్ ఆరోపించింది. -
నారదా స్టింగ్ ఆపరేషన్: మంత్రులకు బెయిల్
కోల్‌కతా: నారదా స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా సీబీఐ అధికారులు ఉదయం ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ మేయర్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ దాదాపు ఆరు గంటలుగా సీబీఐ కార్యాలయం నిజాం ప్యాలెస్ ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రుల అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు భారీ ఎత్తున సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకుని, బ్యారికేడ్లు తొలగించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలను చెదరగొట్టానికి రంగంలోకి దిగిన పారామిలిటరీ సిబ్బంది, పోలీసులపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలు అన్యాయంగా ప్రవర్తిస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారని.. రాజ్యాంగ నిమయాలను పాటించాలని కోరారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ అల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని.. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. చట్టబద్దంగానే ఈ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. Concerned at alarming situation. Call upon @MamataOfficial to follow constitutional norms & rule of law. Police @WBPolice @KolkataPolice @HomeBengal must take all steps to maintain law & order. Sad- situation is being allowed to drift with no tangible action by authorities. — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 17, 2021 ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో చార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. చదవండి: West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం -
West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం
కలకత్తా: పశ్చిమబెంగాల్లో ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్ ఆపరేషన్‌లో సీబీఐ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్‌పై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమబెంగాల్లో కలకలం రేపింది. ఈ సంఘటనతో అగ్గి మీద గుగ్గిలమైన మమతా వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వారిద్దరితో పాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి. ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో చార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది. దీంతో సీబీఐ దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుంది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. దీనిపై కొద్దసేపట్లో సీబీఐ అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. 2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో వీరంతా కెమెరా ముందే డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్ చేసిందని.. ఓటమితో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రుల రహస్య పర్యటనలు.. ఎందుకో!
'ఎబార్ బంగ్లా'... అంటూ అమిత్ షా కంఠం ఖంగుమంటూ మోగింది. దేశవ్యాప్త పర్యటనకు గత నెలలో కోల్‌కతాలో శ్రీకారం చుట్టినప్పుడు అక్కడున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా టీఎంసీ కలవరపడింది. గురువారం నాడు టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ దానిమీద స్పందించారు. ఆయన స్పందన ఎలా ఉన్నా.. పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలోని కొంతమంది సభ్యులు సహా ఇటీవలి కాలంలో పలువురు టీఎంసీ సీనియర్ నాయకులు రహస్యంగా లక్నోకు వెళ్లి వస్తున్నారు. ఎందుకా అన్న విషయం చాలాకాలం పాటు ఎవరికీ అర్థం కాలేదు. చివరకు తేలింది ఏంటయ్యా అంటే.. గతంలో పశ్చిమబెంగాల్లో చురుగ్గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు ఒకరు ఇటీవలే లక్నోకు వెళ్లిపోయారట. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన అక్కడకు వెళ్లారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నారద స్టింగ్ ఆపరేషన్ కేసును, శారదా చిట్‌ఫండ్ స్కాం కేసును తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ రెండు కేసులను వదిలేది లేదని స్పష్టం చేస్తోంది. దాంతో ఎలాగోలా ఆ బీజేపీ పెద్దాయనను ప్రసన్నం చేసుకుని ఆ కేసుల నుంచి బయటపడాలన్నది టీఎంసీ నాయకుల ఉద్దేశంలా కనిపిస్తోంది. అవసరమైతే.. టీఎంసీ నుంచి బయటపడి, బీజేపీలో చేరిపోతామని కూడా వాళ్లు రాయబారాలు నడుపుతున్నారట. కానీ.. బీజేపీ మాత్రం మచ్చపడ్డ నాయకులను తీసుకునేది లేదని తెగేసి చెబుతోంది. 'నో నారదా - శారదా ఇన్ బీజేపీ' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ రెండు కేసులను సీబీఐ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో సుప్రీంకోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసేశారు. ఈ స్కాంను బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ నేతృత్వంలో ఉన్న పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. స్కాంలో పాత్ర ఉందని తెలిస్తే ఎంపీల మీద కూడా గట్టి చర్యలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అస్త్రం బీజేపీకి 2019 ఎన్నికల్లో బాగా ఉపయోగపడేలా కనిపిస్తోంది. బెంగాల్లో అధికారం చేపట్టేంత పరిస్థితి లేకపోయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే చాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇటీవల అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ రెండో స్థానంలో నిలవగా.. వామపక్షాలు, కాంగ్రెస్ వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పరిమితం అయ్యాయి. -
మమతా బెనర్జీకి షాక్
► నారద కేసులో దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం కోల్‌కతా: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేతకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. నరద స్టింగ్ ఆపరేషన్ పై దర్యాప్తు కొనసాగించాలని కతకత్తా హైకోర్టు సీబీఐనీ ఆదేశించింది. సీబీఐ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని కోరుతూ తృణముల్ ఎంపీ ఆలీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వరుస అవినీతి ఆరోపణలతో సతమతమవుతోన్న మమత సర్కార్‌కు ఇది గట్టి ఎదరుదెబ్బతగిలింది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ లాండరింగ్ కేసులో మమత సర్కార్‌పై కేసు నమోదు చేసింది. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోల్లో కొందరు తృణముల్ కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో రాజ్యసభ ఎంపీ ముఖుల్ రాయ్, లోక్‌సభ ఎంపీ సౌగాత రాయ్, వీరితో సంబంధం ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, సోవన్ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్ హుస్సేన్ మీర్జా, ఫిర్హాద్ హకీమ్ తదితరులున్నారు. చిట్‌ఫండ్ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు. -
తృణమూల్ ఎంపీలు, మంత్రులపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: నారద స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్ మంత్రులతో పాటు ఓ ఐపీఎస్ అధికారిపై సీబీఐ కేసు నమో దు చేసింది. కుట్రపూరిత నేరం, అవినీతి తదితర సెక్షన్ల కింద రాజ్యసభ ఎంపీ ముకుల్ రాయ్, లోక్‌సభ సభ్యులు సుల్తాన్ అహ్మద్, సౌగతా రాయ్, కకోలీ ఘోష్ దస్తీదార్, అపురూప పొద్దర్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దుయ్యబట్టారు. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచాక లబ్ధి చేకూరుస్తామన్న తృణమూల్ నేతలు డబ్బులు పుచ్చుకుంటూ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
13 మంది తృణమూల్ నేతలపై సీబీఐ కేసు
నారదా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో 13 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వారిలో పార్టీ సీనియర్ నాయకులు సౌగత రాయ్, ముకుల్ రాయ్, మదన్ మిత్రా సహా పలువురు ఉన్నారు. నెలరోజుల్లోగా ఈ కేసు విషయం తేల్చాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పలువురు తృణమూల్ మంత్రులు, ఎంపీలు అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేశారని, దాంతోపాటు కుట్రలకు కూడా పాల్పడ్డారని ఈ కేసులో పేర్కొన్నారు. నారదా చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ తాలుకు వీడియో ఫుటేజిని కూడా సీబీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేసులో ఇంకా.. సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సుశేందు అధికారి, సోవన్ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్ హుస్సేన్ మీర్జా, ఫిర్హాద్ హకీమ్ తదితరులున్నారు. చిట్‌ఫండ్ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు. తృణమూల్ నాయకులు తమ పదవులను అడ్డుపెట్టుకుని లంచాలు తీసుకున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. త్వరలోనే వారిని ప్రశ్నిస్తామన్నారు. ఈ కేసును పూర్తిగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తారు. స్టింగ్ ఆపరేషన్ సమయంలో వాళ్లు డబ్బులు ఇచ్చిన నారద న్యూస్ ప్రతినిధి మాథ్యూ శామ్యూల్‌ను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. -
నారద సీఈవో సంచలన ఆరోపణలు
కోల్ కతా: నారద స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో ఆ సంస్థ న్యూస్ సీఈవో మాథ్యూ శామ్యూల్ పోలీసులను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా ఆమెకు చుక్కెదురైన విషయం తెలసిందే. మార్చి 17న కోల్ కతా హైకోర్టు స్టింగ్ ఆపరేషన్‌పై ప్రాథమికంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటి నుంచీ తృణముల్ కాంగ్రెస్ నేతల నుంచి తనకు, తన కుటుంబానికి బెదిరింపులు మొదలయ్యాయని.. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో శామ్యూల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఫ్యామిలీ కూడా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటుగా ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్టులకు వేధింపులు, బెదిరింపులు అధికమయ్యాయని, ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. నారదా స్టింగ్ ఆపరేషన్‌లో మొదటి వ్యక్తిని తానేనని, తనపై అనవసరంగా కేసులు నమోదుచేసే యత్నం జరుగుతోందని ఆరోపించారు. తద్వారా తనను ఉద్యోగం నుంచి తప్పించాలన్నది ప్రభుత్వం చర్యేనని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఎవరిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందో.. కేవలం వారి నుంచి తనకు, తన ఉద్యోగులకు ప్రాణహాని ఉందన్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వారిలో అప్పటి, ప్రస్తుత మంత్రులు, సీనియర్ నేతలు ఉండటంతో ప్రభుత్వం ఆ న్యూస్ మీడియా జర్నలిస్టులపై వేధింపు చర్యలు చేపట్టిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు తృణముల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. అయినా ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోల్ కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా మమతకు చుక్కెదురైంది. -
కోర్టు తీర్పుతో మమ్మల్ని వెంటాడుతున్నారు!
న్యూఢిల్లీ: నారద స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్టులకు వేధింపులు, బెదిరింపులు ఎదురవుతున్నాయి. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కొందరు వ్యక్తులు తమను వెంటాడుతున్న విషయాన్ని గుర్తించామని తాజాగా నారద న్యూస్ ఆన్లైన్ పోర్టల్ సీఏవో ఏంజెల్ అబ్రహం పేర్కొన్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న నారద న్యూస్ కు చెందిన పాత్రికేయులందరికీ ఇదేవిధంగా బెదిరింపులు, వెంటాడటాలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ స్టింగ్ ఆపరేషన్‌పై ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన వీడియోలు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది. -
‘నారద’ కేసు సీబీఐకి
-
‘నారద’ కేసు సీబీఐకి
3 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి: కలకత్తా హైకోర్టు కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వ్యవహారంలో ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. ప్రముఖుల ప్రవర్తన ఇతరులు వేలెత్తి చూపేలా ఉండకూడదని, అవినీతి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని జస్టిస్ చక్రవర్తి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని సీఎం మమత చెప్పారు. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది. స్టింగ్ ఆపరేషన్ బూటకం: మమత హైకోర్టు ఆదేశం దురదృష్టకరమని, దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని మమత చెప్పారు. ‘స్టింగ్ ఆపరేషన్ నాటకం. వీడియోను బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు’ అని అన్నారు. ఆపరేషన్‌లో లంచం తీసుకుంటూ కనిపించిన టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు లోక్‌సభలో డిమాండ్ చేశాయి. దర్యాప్తు పరిధిలోకి సీఎంను తేవాలనే డిమాండ్‌తో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కోల్‌కతా భారీ ర్యాలీ నిర్వహించాయి. -
ముఖ్యమంత్రికి భారీ షాక్.. సీబీఐ చేతికి కేసు!
నారదా న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికేసిన టీఎంసీ నేతల కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు నిర్ణయించింది. దీంతో పశ్చిమబెంగాల్ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. ఈ స్టింగ్ ఆపరేషన్ సీడీలు బీజేపీ కార్యాలయం నుంచి ప్రసారం అయ్యాయన్న విషయం అందరికీ తెలుసని, అయితే ఇప్పుడు తాను దీనిపై వ్యాఖ్యానించేది ఏమీ లేదని, ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని మమతా బెనర్జీ అన్నారు. సరిగ్గా 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని, 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిషితా మాత్రే, జస్టిస్ టి. చక్రవర్తి ఆదేశించారు. అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలన్నారు. ఈ కేసు విచారణను ఒక స్వతంత్ర కేంద్ర సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని కలకత్తా హైకోర్టు జనవరిలోనే చెప్పింది. ఈ కేసులో సాక్ష్యాలను బట్టి చూస్తే సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తోందని జస్టిస్ మాత్రే వ్యాఖ్యానించారు. అప్పటికి రాష్ట్ర పోలీసులే కేసును విచారిస్తుండటంతో.. విచారణ సక్రమంగా సాగట్లేదన్న అభిప్రాయంతో కోర్టు ఇలా వ్యాఖ్యానించి ఉంటుందని భావిస్తున్నారు. ఏమిటీ ఆపరేషన్.. గత సంవత్సరం మార్చి నెలలో సరిగ్గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొద్ద ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టింది. అందులో పలువురు టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్యవహారం మొత్తం రికార్డయింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ దీనిపై వివరణ కోరింది. సీడీలలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కూడా ఉండటంతో వారు వివరణ ఇవ్వాలని తెలిపింది. టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు కూడా ఇందులో ఉన్నాడు.