సాక్షి, గుంటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు రెచ్చిపోయారు. మహిళా వాలంటీర్‌ను యరపతినేని కుటుంబ సభ్యులు బంధించారు. మ్యాపింగ్ చేసేందుకు వెళ్లిన మహిళా వాలంటీర్ షేక్ ఎస్మావుల్ వెళ్లగా ఆమెను మూడు గంటల పాటు నిర్భందించి భయబాంత్రులకు గురిచేశారు.
ఈ క్రమంలో మహిళా వాలంటీర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యాపింగ్ చేయడానికి నిన్న(మంగళవారం) సాయంత్రం 6.30గంటలకు వాళ్ల ఇంటికి వెళ్లాను. అన్ని విషయాలు మాట్లాడారు. వారితో అన్ని వివరాలు మాట్లాడి ఇంటికి వెళ్తుండగా.. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీకి ఫోన్ చేసి మళ్లీ ఇంట్లోకి పిలిచిపించారు. నేను మళ్లీ పైనకి వెళ్లడంతో మేడం వాళ్ల తమ్ముడి మాతో వాగ్వాదానికి దిగి నిర్భందించారు. రాత్రి 9 తర్వాత మళ్లీ విడిచిపెట్టారు. ఇంట్లో నుంచి కాల్స్ వచ్చినా నన్ను వాళ్లు విడిచిపెట్టలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment