
సాక్షి, గుంటూరు: టీడీపీ నేతల మైనిగ్ మాఫియా అక్రమాలు బయటపడుతున్నాయి. కోర్టు ఆదేశాలతో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా యరపతినేనితో పాటు,ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు మైనింగ్ ఏడీ జగన్నాధరావు, ఆర్డీవో మురళీ, సీఐ హనుమంతావులపై కూడా కేసు నమోదు చేశారు.
గతంలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై గురవాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో తనపై వ్యతిరేకంగా కేసు పెట్టాడనే కోపంతో యరపతినేని.. గురవాచారిని కాళ్లు, చేతులు విరిగేలా కొట్టించాడు. తనపై జరిగిన దాడి గురించి గురవాచారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టినా వారు పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమీ లేక గురవాచారి హైకోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో యరపతినేనితో సహా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులపై కేసుల నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment