‘వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా’ | Kasu Mahesh Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా’

Published Thu, Jul 6 2023 9:48 PM | Last Updated on Thu, Jul 6 2023 9:50 PM

Kasu Mahesh Reddy Slams Chandrababu Naidu - Sakshi

తాడేపల్లి: ఓటుకు నోటు, బెల్టు షాపులు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేవ్‌రెడ్డి. అసలు రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబని మహేశ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ‘2024లో బాబుకు రిటైర్మెంట్ ఖాయం. వృద్దాప్యంలోనైనా గౌరవంగా బతకండి. వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ అనే సర్వేలతో బాబు వెన్నులో వణుకు. ఆనాడు మద్యపాన నిషేదం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? , మీ బాబు తెచ్చిన మద్యం బ్రాండ్లే నేటికీ ఉన్నాయి..తెలుసుకో యరపతినేని.  లోకేశ్‌ స్టాన్‌ఫర్డ్‌ చదువుకు డోనేషన్‌ కట్టింది ఎవరో లోకానికి తెలియదా..?,  ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? అది చంద్రబాబు ప్రచారమే’ అని విమర్శించారు.

 కాసు మహేశ్‌ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

  • వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా..!:
  •  యరపతినేని ఒక నీతి జాతి లేని నాయకుడు మాట్లాడినట్లు చిల్లరగా మాట్లాడుతున్నాడు. 
  • పేస్‌ యరపతినేనిది...బ్యాక్‌గ్రౌండ్‌ చంద్రబాబుది...ఈ గుంట నక్క రాజకీయాలు ఎన్నిరోజులు..? 
  • చంద్రబాబు మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, అమెరికాలో ఉంటున్న మహిళలతో పోస్టులు పెట్టిస్తున్నాడు. 
  • ఎన్ని రోజులు ఈ రాజకీయాలు...ఎందుకింత భయపడుతున్నాడు..? 
  • టైమ్స్‌ నౌ, ఇండియా టుడే సర్వేలు వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయబోతోందని చెప్తుంటే ఈయన భయపడిపోయి ఇవన్నీ చేస్తున్నాడు. 
  • ఆయన చేసిన తప్పులన్నీ జగన్‌ గారికి ఆపాదిస్తూ ఏదంటే అది మాట్లాడిస్తున్నాడు..మాట్లాడుతున్నాడు. 
  • ఒకడు లిక్కర్‌ అంటాడు...ఒకడు సిమెంట్‌ అంటాడు.
  • అసలు లిక్కర్‌ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఉందా...?
  • మద్యపాన నిషేదం పెడితే ఎత్తేసింది చంద్రబాబు కాదా..? 
  • ఇంటింటికీ లిక్కర్‌ పథకాన్ని పెట్టింది చంద్రబాబు కాదా..? 
  • దేశంలోనే మొట్టమొదటి సారిగా బెల్టు షాపులు పెట్టి వైన్‌ షాపులకు టార్గెట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబే. 
  • మాట్లాడితే లిక్కర్‌లో జే టాక్స్‌ అంటారు...250 బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చింది చంద్రబాబే. 
  • చంద్రబాబు పెట్టిన డిస్టిలరీలే నేటికీ వ్యాపారం చేస్తున్నాయి. 
  • ఆదికేశవులనాయుడిది డిస్టిలరీ లేదా..? ఆయన టీడీపీ కాదా..? 
  • తాను డిస్టిలరీని అమ్మేసుకున్నాను అని అయ్యన్నపాత్రుడు మొన్నీ మధ్య  చెప్తున్నాడు...ఆయన టీడీపీ నేత కాదా..? 
  • యనమల రామకృష్ణుడు వియ్యంకుడు టీడీపీ నేత కాదా..? 
  • ఎస్పీవై రెడ్డి వైఎస్సార్సీపీలో గెలిస్తే ప్రమాణ స్వీకారం చేయకముందే లాగేసుకుని ఆయన చేత డిస్టిలరీ పెట్టించింది చంద్రబాబే. 
  • ఈ రోజుకీ చంద్రబాబు పెట్టిన బ్రాండ్లే రాష్ట్రంలో నడుస్తున్నాయి. 
  • వీళ్లు చెప్తున్న భూమ్‌ భూమ్‌ బ్రాండు, వివిధ రకాల మెడల్స్‌ వారి హయాం నుంచి వస్తున్నవే.
  • ఆనాడు ఆ సంస్థల వద్ద లంచాలు తీసుకుని వాటికి అనుమతులు ఇచ్చింది మీరే కదా. 

  • చేసిన తప్పంతా మీరు చేసి మాపై రుద్దాలనుకుంటే ఎలా..?:
  •  చేసిన తప్పంతా మీరు చేసి ఆ  బురదంతా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి పుయ్యాలంటే ఎలా..?
  • ప్రజలు ఇవన్నీ తెలుసుకోలేని అమాయకులా..? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు అన్నట్లుంది చంద్రబాబు తీరు. 
  • సిమెంట్‌ సంస్థలు ముఖ్యమంత్రి గారికి లంచాలు ఎందుకిస్తారు..? ఈ రాష్ట్రంలో అనేక సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 
  • గతంలో 2014–19 మధ్య ధరలు 10–15శాతం పెరిగాయి...
  • ఈ రోజు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరిగి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సిమెంట్‌ ధరలు పెరిగాయి. 
  • ఒక్క సిమెంట్‌ ధరలే కాదు స్టీల్‌ ధరలు కూడా పెరిగాయి. 
  • బహుశా ఆ తప్పులన్నీ వాళ్లే చేశారేమో..? అందుకే ఇవన్నీ మాపై ఆపాదిస్తున్నారు. 
  • ప్రజలకు అంతా తెలుసు..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఎవరు...మాట తప్పింది ఎవరు అనేది వారు గమనిస్తున్నారు. 
  • వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్‌ గారి నాయకత్వంలో 99 శాతం మేనిఫెస్టో ను అమలు చేశాం. 

  • నువ్వేదో విలువలు కలిగిన నాయకుడి ఫోజులెందుకు చంద్రబాబూ..?:
  • ఎందుకీ కుటిలరాజకీయాలు..ఆలా ఎన్ని రోజులు చేస్తారు..? 
  • చంద్రబాబునే నేరుగా వచ్చి మాట్లాడమనండి...ఆ బూతులేవో తానే మాట్లాడమనండి. 
  • ఎందుకీ నాటకాలు..? ముందొక మాట..వెనకొక మాట. 
  • ఆయనేదో పెద్ద విలువలు కలిగిన నాయకుడిలా ఫోజులెందుకు..? 
  • ఈ దేశంలోనే రాజకీయాలను బ్రష్టు పట్టించింది చంద్రబాబే.
  • ఓటుకు నోటును తీసుకొచ్చింది చంద్రబాబు. ఎన్టీఆర్‌ చనిపోయిన నాడు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఓటుకు యాభై రూపాయలు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబే.
  • ఈ రోజు రాజకీయ వ్యవస్థలో ఓటుకు నోటు ఒక క్యాన్సర్‌లా మారింది. 
  • మీడియాను, వ్యవస్థలను వాడుకోవడం, వారికి ప్రలోభాలు పెట్టడం వల్ల మిమ్మల్ని గత ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. 
  • మళ్లీ ఇక గెలవలేమనే ఫ్రస్టేషన్‌తో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. 
  •  చిన్నవయసులో ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ..కేంద్రంతో మంచి రిలేషన్స్‌ నడుపుతూ ముందుకు వెళ్తూ నిధులు తీసుకొస్తున్నారు. 
  • అది తట్టుకోలేక అక్కసుతో, కుళ్ళుతో చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు. 
  • సొంత బలంతో నిలబడగలుగుతాడా అంటే అదీ ఆయనకు చేతకాదు. 
  • ఆ రోజు ఎన్టీఆర్‌ చనిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 270 సీట్ల వరకూ ఉన్నాయి. 
  • ఈ రోజు తెలంగాణాలో జీరో...అక్కడ పోటీ చేసే దిక్కు లేదు. 
  • ఆంధ్రప్రదేశ్‌ 175 సీట్లలో సొంతంగా పోటీ చేయలేని దుస్థితి. 
  • పవన్‌ కళ్యాణ్‌తో పాటు బీజేపీ కావాలి..కమ్యూనిస్టులు కావాలి...
  • ఇదీ ఈ రోజు టీడీపీని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చాడు..
  • సొంత బలంలో జగన్‌ గారు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా తన రాజకీయాన్ని మొదలు పెట్టి 151 సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించాడు. 
  • 90 శాతం ఎంపీటీసీ, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. 
  • ఎక్కడ చదివామన్నది కాదు..ఎంత సంస్కారం ఉందనేది ముఖ్యం:
  • జగన్‌  చదువులు గురించి కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు. 
  •  జగన్‌ చదివింది బేగంపేటలో కాదా..? పది వరకూ కష్టమైన ఐసీఎస్సీ సిలబస్‌ చదివారు. 
  •  ఇంటర్‌ ఐఎస్సీలో చదివారు. డిగ్రీ చదివారు. ఎంబీఏ చేశారు. 
  • మాట్లాడితే నీ డిగ్రీ ఎక్కడ అని అడుగుతున్నారు. 
  • లోకేశ్‌ స్టాన్‌ఫర్డ్‌లో చదివాడట...ఆయన టెన్త్‌ క్లాస్, ఇంటర్‌ వివరాలు తీయమనండి. 
  • చదువు రాక నారాయణతో ట్రైనింగ్‌ ఇప్పించారు. సత్యం రామలింగరాజు వద్ద లంచంగా తీసుకుని అక్కడ ఫీజు కట్టారు. 
  • ఆ సీటు కూడా మెరిట్‌లో రాలేదు...డొనేషన్‌ కడితే అక్కడ సీటు వచ్చింది. 
  • దానికేదో లోకేశ్‌కు డాక్టరేట్‌ వచ్చినంత బిల్డప్‌లు ఇస్తున్నారు. 
  • అయినా ఎక్కడ చదివామనేది కాదు...సంస్కారం, బుద్ధి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయనేది ముఖ్యం. 
  • సొంత బలంతో జగన్‌ గారు 151 సీట్లు గెలుచుకున్నాడు...మా ఖర్మ లోకేశ్‌ ఆయనతో పోటీ పెట్టుకుంటాడు. 
  • ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాలి కదా..? అదీ మా ఖర్మ ఏం చేస్తాం. 
  • తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి అడ్డదారిలో లోకేశ్‌ మంత్రి అయ్యాడు. 
  • లోకేశ్‌ తన ఎమ్మెల్యే సీటు తాను గెలవలేడు..ఆయనకు మాతో పోటీ అట. 
  • ఆయన పాదయాత్ర చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు భయపడుతున్నారట..నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. 
  • ప్రశాంతతకి, ప్రశాంతి అత్తకి తేడా తెలియని వాడికి వైఎస్సార్సీపీ భయపడుతోందట...
  • ఈ రోజు ఏదో సర్కస్‌లా లోకేశ్‌ పాదయాత్ర నడుస్తోంది...దాన్ని చూసి మాకు నిద్ర పట్టడం లేదనడం హాస్యాస్పదం. 
  • ఈ రోజు ధైర్యంగా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్తున్నారు..గడచిన కాలంలో ఏనాడైనా జరిగిందా..? 
  • ఇంత ధైర్యంగా మేం జనం వద్దకు వెళ్తున్నామంటే వెనుకున్న జగన్‌ గారి బొమ్మ వల్ల..ఆయన చేసిన ప్రజారంజక పాలన వల్ల. 
  • మేనిఫెస్టో ఇచ్చి అదిరిందా తమ్ముళ్లూ..అంటున్నాడు..ఇదేమన్నా రికార్డింగ్‌ డాన్సా..?:

  • జగన్‌  పథకాలు జిరాక్స్‌ తీసి ప్లస్‌ వన్‌ అని యాడ్‌ చేసుకుని మొన్న చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. 
  • పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలను కాపీ కొట్టి ప్రకటిస్తాడు..
  • మళ్లీ అదిరిందా తమ్ముళ్లూ అంటాడు..అదేమన్నా రికార్డింగ్‌ డాన్సా అదిరిపోడానికి..? 
  • అక్కడున్న టీడీపీ వాళ్లే జగన్‌ గారే పథకాలే మనం చెప్తుంటే ఇక మనకెవరు ఓట్లు వేస్తారని అనుకున్నారట. 
  • అదే స్టేజ్‌ మీద కూర్చుని లోకేశ్‌ మాలోకం లెక్కలేస్తున్నాడట..ఇంత డబ్బు ఎలా తెస్తాం అని ఆందోళన చెందుతున్నాడట. 
  • ఖర్మ కాలి అధికారంలోకి వస్తే లక్ష కోట్లు ఎక్కడనుంచి తెస్తాం అని చంద్రబాబును అడిగాడట. 
  • చంద్రబాబు పిచ్చోడా..ఇచ్చేదైతే కదా లెక్కలు కట్టడానికి అని లోకేశ్‌కి చెప్పాడట. 
  • వీళ్లు జగన్‌ గారి నిబద్ధతను, ఆయన్ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. 
  • పనీ పాటా లేకుండా బూతులు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు. 

  • మా నాయకుడిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేదే లేదు:
  • అనైతికంగా జగన్‌ గారిని, భారతి రెడ్డి గారిని ఏది నోటికొస్తే అది మాట్లాడతున్నారు. 
  • ధైర్యముంటే చెప్పండి...ఈ పథకం ఇవ్వలేదని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయాడని చెప్పగలరా..? 
  • మెరుగైన రాజకీయం కోసం ఒక్క సలహా ఇవ్వలేరు. 
  • కేవలం తమ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయంటే ఎలా పడితే అలా మాట్లాడటం, అభూత కల్పనలుచేయడం టీడీపీ వారికి అలవాటుగా మారింది. 
  • ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చి వాళ్లు కాదు. ఎవరేం చేస్తున్నారో అన్నీ చూస్తున్నారు. 
  • ఒక్క తొమ్మిది నెలలు ఆగండి...151 కాదు ఈసారి 175 సీట్లు జగన్‌ గారు కైవసం చేసుకుంటారు. 
  • అప్పుడే వీళ్లకి బుద్ధి వస్తుంది...అప్పటి వరకూ వీళ్ల బతుకులు ఎవరూ మార్చలేరు. 
  • జగన్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రతి కార్యకర్త స్పందిస్తాడు. 
  • వయసు పెద్దదైంది..గౌరవంగా బతకండి...రేపు ఎన్నికల తర్వాత ఎలాగూ రిటైర్‌ అవుతారు. 
  • కనీసం రిటైర్‌మెంట్‌ అయ్యేటప్పుడైనా గౌరవంగా అవ్వండి అని ఉచిత సలహా ఇస్తున్నా. 
  • రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎంత గౌరవంగా వచ్చామో అంతే గౌరవంగా రిటైర్‌ అవ్వాలి. 
  • అలా జరగాలంటే అవతలి వారికి గౌరవం ఇస్తే మీకు గౌరవం దక్కుతుంది. 

  • మేం ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..?:
  • రెండేళ్ల నుంచి ముందస్తు అనే చెప్తున్నారు. వాళ్లకి భయం పట్టుకుంది..వాళ్లకి కార్యకర్తలు నిలబడటం లేదు. 
  • ఇదిగో ఎన్నికలు వస్తున్నాయంటే ఆఫీసుల్లో జనం కనిపిస్తారని వారి భావన. 
  • అందుకే తమ పత్రికల్లో, టీవీల్లో వాళ్లే క్రియేట్‌ చేసి ముందస్తు రాగం పాడుతుంటారు. 
  • జగన్‌  ప్రధానిని కలవడానికి వెళ్లింది అనేక పథకాల గురించి..
  • పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై వెళ్లారు. 
  • ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, ప్రధాని కార్యాలయం కానీ...ఏమైనా చెప్పిందా. 
  • అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి..ప్రజలు ఐదేళ్లు పూర్తి విశ్వాసం జగన్‌ గారికి ఇచ్చారు. 
  • బ్రహ్మాండంగా ప్రభుత్వం నడుస్తోంది...ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్న మాకు ముందస్తు ఎందుకు..? 
  • వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఎంత మైనస్‌ అయ్యాడో వాళ్ల పార్టీ వాళ్లనే అడగండి. 
  • ఒక రోజు ముఖ్యమంత్రి అంటాడు..ఒక రోజు కాదంటాడు..
  • ఆ బూతులేంటి..ఒక రోజు పొత్తు అంటాడు..మరో రోజు లేదంటాడు. 
  • పవన్ కళ్యాణ్ ఏంటో, ఆయన విధానాలేంటో అర్ధం కాక వారి పార్టీ నాయకులే తలపట్టుకుంటున్నారు.
  • పవన్‌ కళ్యాణ్‌ ఎంత జనంలో తిరిగితే అంత క్లారిటీ ప్రజలకు వస్తుంది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement