గురజాల (గుంటూరు) : భార్యను చంపిన కేసులో ముద్దాయిగా ఉండి మూడు సంవత్సరాలు శిక్ష అనుభవించిన అనంతరం పేరోల్ పై బయటకు వచ్చి అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం కంచరకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన కొప్పుల యోగయ్య(45) 1990 నవంబర్ 26న భార్యను హత్య చేశాడు. దీంతో గుంటూరు కోర్టు 1991లో అతనికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది.
అప్పటి నుంచి మూడేళ్ల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవించిన యోగయ్య 1994 జూలై 6న పేరోల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా.. కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. యోగయ్య దుర్గి మండలం కంచరగుంటలో నివాసముంటున్నాడనే సమాచారం అందడంతో.. జైలర్ తన సిబ్బందితో రంగంలోకి దిగి అతన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో తప్పించుకున్న ఖైదీ
Published Mon, Jan 18 2016 6:30 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
Advertisement