occupy
-
మీరు ఆక్రమిస్తుంటే... మేం లాలీపాప్ తింటామా?
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ను మరికొద్ది రోజుల్లోనే ఆక్రమించుకుంటామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నేతలు కొందరు చేస్తున్న అతి వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ దీటైన సమాధానమిచ్చారు. అవన్నీ మతిలేని వ్యాఖ్యలంటూ ఆమె కొట్టిపారేశారు. ‘మీరొచ్చి బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమించుకుంటూ ఉంటే మేం లాలీపాప్ తింటూ కూర్చుంటామనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. ‘మా భూభాగాన్ని మా నుంచి లాక్కునే సత్తా ఎవ్వరికీ లేదు. అటువంటి ఆలోచన కూడా రానివ్వకండి’అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను ప్రేరేపించే దురుద్దేశంతోనే ఓ రాజకీయ పార్టీ ఫేక్ వీడియోలను ఇక్కడ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. భారత్‌లో పరిణామాలను రాజకీయం చేయాలని చూడటం బంగ్లాదేశీయులతోపాటు బెంగాల్‌కు, ఇక్కడి ప్రజలకు కూడా క్షేమకరం కాదని మమత హెచ్చరించారు. అనవసరమైన వ్యాఖ్యల కారణంగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదముందని కూడా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
చైనా నుంచి తైవాన్ను కాపాడుతాం
బీజింగ్: తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం పునరుద్ఘాటించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. చైనా ఆక్రమణ నుంచి అమెరికా బలగాలు, ప్రజలు తైవాన్ను రక్షిస్తారని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రానికి సంబంధించి తైవాన్ ప్రజలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. స్వతంత్రంగా ఉండాలంటూ వారిని మేం ప్రోత్సహించం’ అని అన్నారు. తైవాన్ అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ విధానమని అనంతరం వైట్‌హౌస్ అనంతరం పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి యథాతథమని తెలిపింది. అయితే, తైవాన్ విషయంలో సైనిక జోక్యంపై స్పందించలేదు. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవలి తైవాన్ సందర్శనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ ప్రాంతంపైకి క్షిపణులను ప్రయోగించడం, యుద్ధ విమానాలను మోహరించడం తదితర చర్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో బైడెన్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దాలుగా ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న అమెరికా తైవాన్‌తో అధికారికంగా సంబంధాలు కొనసాగించడం లేదు. బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. -
ఉక్రెయిన్ను ఆక్రమిస్తే ఆంక్షలు తప్పవు
వాషింగ్టన్: ఉక్రెయిన్ తూర్పు సరిహద్దు వెంట లక్షా 75వేల మంది సైనికులను, యుద్ధ ట్యాంకులను మోహరింన రష్యాను అమెరికా హెచ్చరింంది. ఉక్రెయిన్ సారభౌమత్వం, సమగ్రతలను దెబ్బతీసే రష్యా దూకుడుకు అంతర్జాతీయ ఆంక్షలతో ధీటైన సమాధానం చెప్తామని పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పుతిన్‌కు స్పష్టంచేశారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వర్చువల్ భేటీ ఇందుకు వేదికైంది. దాదాపు రెండు గంటలపాటు ఇరు అగ్ర రాజ్యాధినేతలు మాట్లాడుకున్నారు. వాషింగ్టన్లో వైట్‌హౌస్ నుంచి బైడెన్, నల్ల సముద్ర తీర పట్టణం సోచీలోని అధికార నివాసం నుంచి పుతిన్ వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో మొదలైన ఈ వీడియో కాల్ వర్లో వాడివేడి చర్చలతో ముగిసిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నాటో కూటమిలోకి ఉక్రెయిన్ను చేర్చుకోవాలనే ఆలోచనను మానుకోవాలని, ఈ మేరకు అమెరికా చట్టబద్ధ హామీ ఇవ్వాలని బైడెన్‌తో పుతిన్ వ్యాఖ్యానింనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోనుందనే అమెరికా నిఘా నివేదికల నేపథ్యంలో ఇరునేతల భేటీ అంశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అణ్వాయుధాల నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, ఇరాన్ అణు కార్యక్రమాలు సైతం వీరి చర్చల్లో భాగం కావచ్చని అమెరికా ఉన్నతాధికారులు చెప్పారు. -
మూసీ ఆక్రమణలు తొలగించండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: మూసీ నది ఒడ్డున వెలిసిన ఆక్రమణల తొలగిం పునకు చర్యలు తీసుకోవాలని మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్, జీహెచ్ఎంసీలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి, సుందరీకరణ ప్రాజె క్టుపై నగర మేయర్ రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌లతో కలసి మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. జీవనాధారం కోసం మూసీ ఒడ్డున తాత్కాలిక గృహాల్లో నివసిస్తున్న పేదలకు అందుబాటులో ఉన్న వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అధికారులు మూసీ నది అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. -
'అరణ్య' రోదన
* అన్యాక్రాంతమవుతున్న అటవీ భూములు * పట్టించుకోని అధికారులు * పేదల సాగుకు మాత్రం ప్రతి బంధకాలు వనం–మనం, మొక్కలు నాటండి..పర్యావరణాన్ని కాపాడండి ఇలాంటివన్నీ ప్రభుత్వ పెద్దల చిలక పలుకులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించడానికి అవకాశం ఉన్నచోట కూడా అధికారుల అలసత్వం, పాలకులు నిర్లక్ష్యంతో హామీల అమలు ఆచరణ గడప దాటడం లేదు. వన సంరక్షణకు ప్రధాన వేదికలైన అటవీ భూములను అక్రమార్కులు అన్యాక్రాంతం చేస్తున్నా అధికారుల్లో చలనం కలగడం లేదు. తిరువూరు: పశ్చిమ కృష్ణాలోని తిరువూరు నియోజకవర్గంలో 10 వేల ఎకరాల రిజర్వు అటవీ భూమి ఉంది. దీర్ఘకాలంగా ఈ భూముల స్థితిగతులను పట్టించుకోని అధికారులు ఏటా వనసంరక్షణ పేరుతో మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారు. మొక్కల పెంపకానికి నియమించిన కూలీలకు సైతం సక్రమంగా సొమ్ములు చెల్లించని కారణంగా పట్టించుకునే నాథుడు లేక మొక్కలు ఎదుగుదల లోపించి కునారిల్లుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల, ఆంజనేయపురం, చౌటపల్లి, మల్లేల, కాకర్ల, లక్ష్మీపురం, చిక్కుళ్లగూడెం, ఏ కొండూరు మండలంలోని కృష్ణారావుపాలెం, చీమలపాడు, కొండూరు, కోడూరు, రామచంద్రాపురం, గంపలగూడెం మండలం వినగడప, నారికింపాడు, కనుమూరు, విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల అటవీ భూములున్నాయి. పలుచోట్ల రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం జాయింట్ సర్వే జరిపి హద్దులు నిర్ణయించి కందకాలు తవ్వారు. తదుపరి కొందరు పెద్దల ఒత్తిడితో అటవీశాఖ భూముల హద్దులు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు ప్రతి బంధకాలు.. అటవీభూమిని జీవనోపాధి కోసం సాగు చేసుకునే పేదలపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేసే అధికారులు యథేచ్ఛగా కొండలు, గుట్టలు తవ్వి మట్టి విక్రయించి సొమ్ము చేసుకునే వారిని వదిలేస్తున్నారు. సమీప పొలాల్లో అటవీ భూమి కలుపుకునే వ్యక్తులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తిరువూరు మండలంలోని మల్లేలలో ఇటీవల అటవీ అధికారులు ఎస్సీ, ఎస్టీల భూములు ఖాళీ చేయాలని వేధింపులకు గురి చేసినప్పటికీ సాగుదారులు సంఘటితంగా నిలబడటంతో అధికారులు వెనక్కు తగ్గారు. కిందిస్థాయి సిబ్బంది మామూళ్ల మత్తులో అటవీ భూముల ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు కబ్జాదారులు కోట్లాది రూపాయల విలువైన భూములు కాజేసేందుకు పావులు కదుపుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు తీవ్ర హాని.. రిజర్వు అటవీ భూములను ఆక్రమించి పంటలు సాగు చేస్తుండటంతో మొక్కల పెంపకానికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం కింద అటవీ భూముల్లో మొక్కల పెంపకం, నీటి వనరుల అభివృద్ధికి చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వాగులు వంకల్లో నీటి పారుదలకు అవరోధాల తొలగింపు నిధులు మంజూరైనా పనులు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. నారికింపాడు అడవులను వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా 50 ఏళ్ల క్రితమే ప్రకటించినప్పటికీ ఇంతవరకు తదనుగుణంగా చర్యలు చేపట్టలేదు. ఆక్రమణదారులపై కేసులు: రంజిత్, అటవీ రేంజి అధికారి, ఏ కొండూరు అటవీ భూములను ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. మల్లేల అటవీ భూముల్లో ఆక్రమణలు తొలగించి 25 ఎకరాల్లో మొక్కలు నాటాం. వీటి సంరక్షణ బాధ్యతలను త్వరలో వన సంరక్షణ సమితులకు అప్పగిస్తాం. గతంలో ఆక్రమణకు గురైన భూముల విషయం న్యాయస్థానాల పరిధిలో ఉంది. ఇకపై ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అటవీ భూముల రక్షణకు చర్యలు: రక్షణనిధి, ఎమ్మెల్యే, తిరువూరు అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తాం. వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన చర్యలు కూడా తక్షణం తీసుకునే విధంగా కృషి చేస్తాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. -
బీడు భూములపై కన్ను
* 159 ఎకరాల్లో దుర్గి బీడు భూములు * 60 ఎకరాల్లో రాత్రి వేళ చదును పనులు * అధికార పార్టీ అండతోనే కబ్జా..? దుర్గి బీడు భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. 159 ఎకరాల్లో విస్తరించిన ఈ భూముల్లో 60 ఎకరాలను రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా చదును చేయిస్తున్నారు. ఓ పది ఎకరాల్లో ఇప్పటికే పత్తి పంటను సాగు చేశారు. పశువుల మేతకు వినియోగించే భూములను కబ్జా చేయడంపై రైతులు, పశుపోషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దుర్గి : దుర్గి బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో బుగ్గవాగు రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న దుర్గి బీడు భూములుగా పేరుగాంచిన ఎన్ఎస్పీ భూములు సుమారు 159 ఎకరాలు ఉన్నాయి. అందులో కబ్జాదారులు సుమారు 60 ఎకరాలను రాత్రి సమయాలలో పొక్లయిన్లతో పిచ్చిమొక్కలు, బండరాళ్లను తొలగించి సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుర్గి గ్రామస్తుల ద్వారా సోమవారం వెలుగులోకి వచ్చింది. అందులో 10 ఎకరాల భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ భూ కబ్జాలకు పాల్పడిన ప్రముఖ వ్యక్తులు దుర్గి, కంచరగుంట, ఆత్మకూరు, కంభంపాడు, అంజనాపురం గ్రామాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూములను ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెల మేత కోసం ఉపయోగించుకుంటున్నారు. భూములను కబ్జా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఇలాంటి ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడడంలో కొంతమంది ముందంజలో ఉన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు నివసించడానికి రెండు సెంట్ల భూమి కూడా ఇవ్వలేని నాయకులు కబ్జాదారులకు అండదండలుగా ఉండటం శోచనీయం. దీనిపై తహసీల్దార్ ఏసుబాబును ‘సాక్షి’ వివరణ కోరింది. గురువారం భూములు పరిశీలిస్తామని, ఆక్రమణ జరిగినట్లు ఉంటే నిందితులపై చర్యలు తీసుకుం టామని వివరించారు. -
టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ
-
టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీడీపీ కార్యాలయం విషయంలో వివాదం ఏర్పడింది. టీడీపీ ఆఫీసును తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం ముందు తృణమాల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. తమకు 40 మంది ఎంపీలున్నారని, టీడీపీకి కేవలం 22 మంది ఎంపీలే ఉన్నందున తమకే ఆ ఆఫీసు ఉపయోగించుకునే అర్హత ఉందని తృణమాల్ ఎంపీలు చెప్పారు. అయితే 30 ఏళ్లుగా తమ పార్టీ ఇదే కార్యాలయాన్ని వాడుకుంటున్నందున తమకే దక్కాలని టీడీపీ ఎంపీలు వాదిస్తున్నారు. -
రూ. 40 కోట్ల స్థలం కబ్జాకు యత్నం
శంషాబాద్, న్యూస్‌లైన్: సర్కారు భూమే కదా అనుకున్నారేమో మరి.. దాదాపు రూ.40 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసే యత్నం చేశారు. జేసీబీతో చదును చేశారు. సకాలంలో రెవెన్యూ అధికారులు స్పందించడంతో వారి ఆటకు అడ్డుకట్ట పడింది. ఈ సంఘటన సోమవారం శంషాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సిద్దులగుట్ట ప్రాంతంలో సర్వే నంబరు 363లోని 43 ఎకరాల 18 గుంటల సర్కారు స్థలాన్ని నగరానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం జేసీబీతో చదును చేశారు. సదరు స్థలం తమదేనంటూ హైదరాబాద్ తాడ్బన్ ప్రాంతానికి చెందిన వారు రాళ్లను, ముళ్లకంచెను తొలగించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడి వెళ్లి పనులను నిలిపివేయించారు. ఇంతలోనే అక్కడే ఉన్న కొందరు వారితో దురుసుగా వ్యవహరించారు. నవాబులకు చెందిన భూమి తమకు వారసత్వంగా వచ్చిందని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమవద్ద దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని దబాయించారు. వీఆర్వో ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సదరు భూమి సర్కారుదని, పనులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు.. సర్కారు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించి రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులపై వీఆర్వో ఇంద్రసేనారెడ్డి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది ప్రభుత్వ స్థలమే: లచ్చిరెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం శంషాబాద్ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 363లోని 43 ఎకరాల 18 గుంటలు పూర్తిగా ప్రభుత్వ స్థలమే. అక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి పనులు చేపట్టడానికి వీల్లేదు. సదరు స్థలంలో ఎటువంటి పనులు చేపట్టినా కేసులు నమోదు చేస్తాం.