USA: Warns Strict Actions Taken If Russia Invade Ukraine - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే ఆంక్షలు తప్పవు

Published Wed, Dec 8 2021 11:56 AM | Last Updated on Wed, Dec 8 2021 12:41 PM

USA Warns Strict Actions Taken If Russia Invade Ukraine - Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ తూర్పు సరిహద్దు వెంట లక్షా 75వేల మంది సైనికులను, యుద్ధ ట్యాంకులను మోహరింన రష్యాను అమెరికా హెచ్చరింంది. ఉక్రెయిన్‌ సారభౌమత్వం, సమగ్రతలను దెబ్బతీసే రష్యా దూకుడుకు అంతర్జాతీయ ఆంక్షలతో ధీటైన సమాధానం చెప్తామని పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పుతిన్‌కు స్పష్టంచేశారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో వర్చువల్‌ భేటీ ఇందుకు వేదికైంది. దాదాపు రెండు గంటలపాటు ఇరు అగ్ర రాజ్యాధినేతలు మాట్లాడుకున్నారు.

వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌ నుంచి బైడెన్, నల్ల సముద్ర తీర పట్టణం సోచీలోని అధికార నివాసం నుంచి పుతిన్‌ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో మొదలైన ఈ వీడియో కాల్‌ వర్లో వాడివేడి చర్చలతో ముగిసిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకోవాలనే ఆలోచనను మానుకోవాలని, ఈ మేరకు అమెరికా చట్టబద్ధ హామీ ఇవ్వాలని బైడెన్‌తో పుతిన్‌ వ్యాఖ్యానింనట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోనుందనే అమెరికా నిఘా నివేదికల నేపథ్యంలో ఇరునేతల భేటీ అంశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అణ్వాయుధాల నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, ఇరాన్‌ అణు కార్యక్రమాలు సైతం వీరి చర్చల్లో భాగం కావచ్చని అమెరికా ఉన్నతాధికారులు చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement