సాక్షి,హైదరాబాద్: మూసీ నది ఒడ్డున వెలిసిన ఆక్రమణల తొలగిం పునకు చర్యలు తీసుకోవాలని మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు.
మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి, సుందరీకరణ ప్రాజె క్టుపై నగర మేయర్ రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌లతో కలసి మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. జీవనాధారం కోసం మూసీ ఒడ్డున తాత్కాలిక గృహాల్లో నివసిస్తున్న పేదలకు అందుబాటులో ఉన్న వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అధికారులు మూసీ నది అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment