సుందరీకరణ, హైడ్రా పేరుతో బెదిరిస్తున్నారు: కేటీఆర్
మూసీ పక్కన మూడు నెలలు కాదు.. మూడేళ్లు ఉంటా..
నాగోలు ఎస్‌టీపీని పరిశీలించిన కేటీఆర్
నాగోలు (హైదరాబాద్): మూసీ పునరుజ్జీవం కో సం రూ.26 వేల కోట్లు మించని వ్యయాన్ని లక్షన్నర కోట్లు కావాలని చెబుతుంటే ఎలా అంగీకరిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మీరు చేసే దోపిడీకి వ్యతిరేకమని అన్నారు. శనివారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో కలిసి ఆయన నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నాగోల్‌లో 320 ఎంఎల్‌డీ సామ ర్థ్యంతో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభు త్వాలేనని ఆరోపించారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి కోసం రూ.3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తోందని చెప్పారు.
మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ కట్టండి
బీఆర్‌ఎస్ హయాంలో మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లు తలెత్తకుండా మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్ నిర్మించాలనుకున్నామన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని చెప్పారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తెలిపారు. మూసీకి రెండువైపులా రిటై నింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బంగారి లక్ష్మా రెడ్డి, వివేకానంద్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment