హైదరాబాద్, సాక్షి: మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని.. గత బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన ఎస్‌టీపీ(sewage treatment plants)ను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. బీఆర్‌ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు.
‘‘ రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు . గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. మా హయాంలో రూ. 4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించాం.
.. మూసీ నదీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. లక్ష 50వేల కోట్లు.. 70వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది.
ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ఇక రేవంత్ విచారణ
.. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకైన నగరం హైదరాబాద్. STPలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తాం.
.. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా?. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక మాటలే ఒక ఉదాహరణ.
ప్రస్తుత ప్రభుత్వం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు. పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు’’ అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment