బీఆర్‌ఎస్ ధ్వజం
మూసీపై నేడు కేటీఆర్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు అర్థరహితంగా ఉందని బీఆర్‌ఎస్ ధ్వజమెత్తింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం కీలక ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ భవన్‌లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపింది.
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ప్రతిపాదించి, చాలా వరకు పూర్తి చేసినట్లు కేటీ రామారావు పలు సందర్భాల్లో వెల్లడించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎస్‌టీపీల నిర్మాణ పనులను ఇటీవల కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment