
సాక్షి నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పర్యటించారు. వెంకటగిరిలో జగనన్న కాలనీని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. తొలివిడతలో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న మహిళా లబ్ధిదారులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. దశాబ్దాల కాలం నాటి తమ సొంతింటి కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేద మహిళా లబ్ధిదారులు తెలిపారు. అనంతరం వెంకటగిరిలో వైఎస్సార్ సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఇంట్లో శుభకార్యానికి సజ్జల రామకృష్ణారెడ్డి హజరయ్యారు.
చదవండి:ఈ నెల 24న అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి