రాఘవేంద్రుల సేవలో ఉమ్మడి హైకోర్టు జడ్జి
మంత్రాలయం రూరల్: ఉమ్మడి హైకోర్టు జడ్జి రామసుబ్రమణ్యం ఆదివారం శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ఆయన శనివారమే ఆయన మంత్రాలయం చేరుకున్నారు. తెల్లవారుజామున గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులతో కలిసి వేదపాఠశాల భవనం, గోశాల, పరిమళ పాఠశాల, సుశీలేంద్రవసతిగృహం, తుంగభద్ర నది తీరాన్ని పరిశీలించారు. ఈయనతో పాటు మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ.నరసింహమూర్తి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ శ్రీనివాసనాయక్ తదితరులు ఉన్నారు.