నేడు గజలక్ష్మికి వీడ్కోలు
నేడు గజలక్ష్మికి వీడ్కోలు
Published Sat, Dec 3 2016 9:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
– శాస్త్రోక్తంగా సాగనంపేందుకు శ్రీమఠం ఏర్పాట్లు
– టీటీడీ జూ పార్కుకు తరలింపు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి సేవలో తరించిన గజలక్ష్మికి (ఏనుగు) నేడు వీడ్కోలు పలుకనున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా పూజలు గావించి సాగనంపనున్నారు. శ్రీమఠంలో పాతికేళ్లపాటు ప్రహ్లాదరాయల సేవలో గజలక్ష్మి తరించింది. 2009 వరద కారణంగా జింకల పార్కులో జింకలు మృత్యువాత పడగా వన్యప్రాణుల సంరక్షణ శాఖ శ్రీమఠంపై కొరడా ఝలిపించింది. ఏనుగుకు అనుమతులు లేని కారణంగా ప్రత్యక్ష సేవను నిలిపేశారు. అప్పటి నుంచి ఏనుగు వీఐపీల స్వాగతం, భక్తుల ఆశీర్వాదానికి పరిమితమైంది. వయోభారం దృష్ట్యా జంతు సంరక్షణ శాఖ సూచన మేరకు ఏనుగును తరలించేందుకు శ్రీమఠం నిర్ణయం తీసుకుంది. ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం జంతు ప్రదర్శన శాలకు తరలించనున్నారు. ఏనుగు సేవకు సెలవు పలికేందుకు ప్రత్యేక పూజలు చేపట్టిన్నట్లు మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏనుగు రవాణా ఖర్చులు శ్రీమఠమే భరిస్తున్నట్లు తెలిపారు. భక్తులు తరలివచ్చి వీడ్కోలు వేడుకలో తరలించాలని కోరారు.
Advertisement
Advertisement