సాక్షి, మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ మంగళవారం ఉదయం వచ్చారు. శ్రీ మఠం అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని కుంకుమార్చన, మహా మంగళ హారతి పూజలు చేశారు.
అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్రతీర్థులు శేష వస్త్రం, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు. కాగా, రజనీకాంత్ వచ్చారని తెలుసుకున్న ఆయన అభిమానులు, భక్తులు చూసేందుకు భారీగా తరలిరావడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment