వరుసగా రెండు రోజులు సెలవుదినాలు కావడంతో మంత్రాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
మంత్రాలయం (కర్నూలు జిల్లా) : వరుసగా రెండు రోజులు సెలవుదినాలు కావడంతో మంత్రాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
భక్తులు తొలుత గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ రాఘవేంద్ర కూడా స్వామివారిని దర్శించుకున్నారు.