
మంత్రాలయంలో భక్తుల రద్దీ
మంత్రాలయం (కర్నూలు) : మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.