భయపెట్టే మంత్రం! | Heroine-oriented film | Sakshi
Sakshi News home page

భయపెట్టే మంత్రం!

Published Sat, Apr 9 2016 10:05 PM | Last Updated on Tue, Oct 9 2018 3:56 PM

భయపెట్టే మంత్రం! - Sakshi

భయపెట్టే మంత్రం!

తెలుగులో హారర్ థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అదే తరహా కథాంశంతో ఓ  హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రూపొందనుంది.  మమతా రావత్,  ప్రదీప్ ముఖ్యతారలుగా  యం.ఎస్.బాబు స్వీయదర్శకత్వంలో నిర్మించనున్న  చిత్రం ‘మంత్రం తంత్రం యంత్రం’. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
 
 ముహూర్తపు సన్నివేశానికి వరంగల్ ఎంపి దయాకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని దర్శక-నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరి దోసాడ, కథ: మహేశ్వర్, సహ నిర్మాతలు: అంబాల రవి, మోతే ప్రకాశ్‌రెడ్డి, ఎన్. అప్సర,యస్.కె.మఖ్బూల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement