Heroine-oriented film
-
భయపెట్టే మంత్రం!
తెలుగులో హారర్ థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అదే తరహా కథాంశంతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రూపొందనుంది. మమతా రావత్, ప్రదీప్ ముఖ్యతారలుగా యం.ఎస్.బాబు స్వీయదర్శకత్వంలో నిర్మించనున్న చిత్రం ‘మంత్రం తంత్రం యంత్రం’. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వరంగల్ ఎంపి దయాకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని దర్శక-నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరి దోసాడ, కథ: మహేశ్వర్, సహ నిర్మాతలు: అంబాల రవి, మోతే ప్రకాశ్‌రెడ్డి, ఎన్. అప్సర,యస్.కె.మఖ్బూల్. -
ఇప్పటికి ఇంకా 20 ఏళ్లే!
‘ఆకాశమంత’ చిత్రం తర్వాత త్రిష మళ్లీ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయలేదు. తాజాగా, ఒక విభిన్నతరహా చిత్రంలో ఆమె నటించనున్నారు. తమిళ దర్శకుడు గోవర్ధన్ సారథ్యంలో హారర్, కామెడీ చిత్రంలో త్రిష విలక్షణంగా కనిపించనున్నారు. ఇందులో ఆమె పోషించనున్న పాత్రకు రెండు పార్శ్వాలుంటాయట. అందుకోసం చాలా కష్టపడుతున్నారు త్రిష. సినిమాలో కాసేపు 20 ఏళ్ల కాలేజీ అమ్మాయిగా త్రిష కనిపిస్తారు. దర్శకుడు ఆ సంగతి చెప్పగానే 6 కిలోలు తగ్గడానికి సిద్ధమైపోయారు. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. చిత్రం ఏమిటంటే, సినిమాలో అదే పాత్ర కొన్ని సన్నివేశాల తరువాత పెరిగిన వయసుతో, పరిణతితో కనిపిస్తుంది. దాని కోసం త్రిష మళ్లీ పది కిలోలు పెరగాల్సి ఉంటుంది. మొత్తం మీద త్రిషను తన గత చిత్రాల కంటే భిన్నంగా ఆమెను కొత్తగా చూపించాలని దర్శకుడు గోవర్ధన్ ప్రయత్నం. త్రిష కూడా దాన్ని ఆ ఛాలెంజ్‌గా తీసుకున్నట్లే ఉంది. చూద్దాం... 20 ఏళ్ళ బాలా కుమారిగా త్రిష ఎలా కనువిందు చేస్తారో!