![TDP MLA Candidate Tikka Reddy Gunman Opens Fire - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/16/TDP1.jpg.webp?itok=WkOLq3oG)
సాక్షి, కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కగ్గల్లులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి శనివారం ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment